Home

»

Tv News

బిగ్‌బాస్ హౌస్‌లోకి ముకేశ్ తల్లి.. కొడుకు ప్రవర్తనపై ఏమందంటే.!

Nov 12, 2026 10:16AM

బిగ్‌బాస్ తెలుగు 10లో 66వ రోజు ముకేశ్‌కు ఎంతో స్పెషల్ డేగా నిలిచింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అతడి తల్లి రావడంతో చాల సంతోషపడ్డాడు. అలాగే భావోద్వేగానికి గురయ్యాడు. తల్లిని చూడగానే ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆమె కూడా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది . తర్వాత ఇంటి సభ్యులందరినీ పలకరించింది. ఈ సందర్భంగా ముకేశ్ తన ప్రవర్తన గురించి తల్లిని అడిగాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తనను చూస్తున్నప్పుడు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించాడు. అందుకు ఆమె నీ కోపమే నీలో ఉన్న ప్రధాన లోపమని చెప్పింది. అయితే వర్షిణి తన కోపాన్ని చాలా వరకు తగ్గించిందని ముకేశ్ బదులిచ్చాడు. అయినప్పటికీ కోపాన్ని మరింత అదుపులో పెట్టుకోవాలని తల్లి సూచించింది.

ఆ తర్వాత తన తల్లి గొప్పతనం గురించి ముకేశ్ తోటి కంటెస్టెంట్లతో చెప్పాడు. తన తండ్రికి స్ట్రోక్ వచ్చి రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైనప్పుడు తల్లి ఎంతో ఓపికగా సేవలు చేసిందని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఎప్పుడూ విసుక్కోకుండా తండ్రిని చూసుకుందని చెప్పుకొచ్చాడు . తల్లి కష్టాన్ని చూసే జీవితంలో ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇక ముకేశ్ తల్లి తర్వాత అమన్ తండ్రి కూడా హౌస్‌లోకి వచ్చారు. ఇంటి సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన కొడుకుతో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో ఆనందం నెలకొంది.

గుప్పెడంత సీరియల్ లో రిషి సర్ రోల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేశ్. 2015 లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ని గెలుచుకున్నాడు . 2017 లో కన్నడ టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతా శంకరం’ ద్వారా హీరో అయ్యాడు . కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 లో అవకాశం వచ్చిన షో కాన్సెప్ట్ తెలీక వెళ్లలేకపోయాడు. ఇక తెలుగు బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఇంకా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com