Home

»

Tv News

BiggBoss 10 Telugu : పదోవారం ఓటింగ్ లో త్రిగుణ్ టాప్.. డేంజర్ జోన్‌లో శివ్ కుమార్!

Nov 12, 2026 10:20AM

బిగ్ బాస్ సీజన్-10 పదో వారం ఓటింగ్ పోల్‌లో పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. హౌస్‌లో అందరు నామినేషన్‌లో ఉండటంతో ఈ వారం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తాజా వోటింగ్ ట్రెండ్ చూస్తే ఇన్నాళ్లూ టాప్‌లో ఉన్న ముఖేష్‌ను త్రిగుణ్ దాటేశాడు. ఫ్యామిలీ వీక్‌లో త్రిగుణ్‌కి వచ్చిన సపోర్ట్, బీబీ స్కూల్ టాస్క్‌లో ఫన్‌తో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ వారం ఓటింగ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని త్రిగుణ్ కైవసం చేసుకున్నాడు.

ఓటింగ్ లెక్కల్లోకి వెళ్తే త్రిగుణ్ 30.01% ఓట్లతో (37,527 ఓట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. అతడికి గట్టి పోటీ ఇస్తూ ముకేష్ 29.89% ఓట్లతో (37,383 ఓట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 0.12% మాత్రమే, అంటే 144 ఓట్ల తేడా మాత్రమే. మూడో స్థానంలో దేబ్జానీ 9.33% ఓట్లతో (11,670 ఓట్లు) ఉంది. ఆ తర్వాత వర్షిణి 5.01% (6,265 ఓట్లు), అమన్ 4.31% (5,391 ఓట్లు), నీతూ 3.88% (4,855 ఓట్లు)తో ఉన్నారు. నరేష్ 3.66% (4,573 ఓట్లు), సుధీర్ 3.29% (4,117 ఓట్లు), రామ్ ప్రసాద్ 3.17% (3,961 ఓట్లు)తో దాదాపు ఒకే రేంజ్‌లో కొనసాగుతున్నారు.

డేంజర్ జోన్‌లో మాత్రం రామ కృష్ణ, శ్వేత, శివ కుమార్ ఉన్నారు. రామ కృష్ణ 2.75% ఓట్లతో (3,436 ఓట్లు) 10వ స్థానంలో, శ్వేత 2.39% ఓట్లతో (2,993 ఓట్లు) 11వ స్థానంలో, శివ కుమార్ 2.31% ఓట్లతో (2,892 ఓట్లు) చివరి స్థానంలో ఉన్నారు. ఎంగేజ్మెంట్‌తో హౌస్‌లో సందడి చేసిన శివ కుమార్‌కి ఓటింగ్‌లో మాత్రం అది కలిసి రాలేదనే టాక్ వినిపిస్తోంది. గత వారాల్లో సైలెంట్‌గా ఉన్న శివ కుమార్‌కి ఫ్యామిలీ వీక్ కూడా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఇది అనధికారిక ఆన్‌లైన్ వోటింగ్ పోల్ మాత్రమే. అసలు జియో హాట్‌స్టార్ వోటింగ్‌తో పాటు మిస్డ్ కాల్ ఓట్లు కలిపితే లెక్క మారే ఛాన్స్ కూడా ఉంది.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్రిగుణ్, ముఖేష్ ఇద్దరూ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నా.. చివరి నిమిషంలో ఓటింగ్ మారిపోవడం బిగ్ బాస్‌లో కామనే. శివ కుమార్, శ్వేత, రామ కృష్ణ ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తే వాళ్లు కూడా బయటపడే ఛాన్స్ ఉంది. ఈ వీకెండ్‌లో నాగార్జున ఎవరిని సేవ్ చేస్తాడు, ఎవరిని ఇంటి నుంచి పంపిస్తాడనేది చూడాలి మరి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com