Home

»

Tv News

మా నాన్న అమ్మను, మమ్మల్నే కాదు, మా తాతను కొట్టేవాడు

May 31, 2026 11:33AM

బుల్లితెర మీద మౌనరాగం సీరియల్ తో ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ప్రియాంక, శివ్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి. ఐతే రీసెంట్ గా ఒక టాక్ షోకి వచ్చిన శివ్ తన పెళ్లి గురించి ప్రియాంక గురించి చెప్పాడు. "నాకు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ప్రియాంక తనకంటే నన్నే బాగా చూసుకుంటుంది. తనకంటే నాకోసమే ఎక్కువగా షాపింగ్ చేస్తుంది. అలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చాక నేను ఇంకెవరిని చూడాలి. ప్రియాంక దగ్గర నేను చిన్నపిల్లాడిలా ఉంటాను ఎలా ఐతే మా అమ్మ దగ్గర ఉంటానో. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకుంటాం. ఐతే పెళ్లి ప్లానింగ్ చేసాం. ఉత్తరాఖండ్ లోని త్రియోగి నారాయణ్ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. అక్కడ శివపార్వతుల పెళ్లి జరిగింది. అప్పుడు వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. నేను శివ్ ప్రియాంక నా పార్వతి కదా అందుకే అక్కడే మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. మా నాన్నకు తాగుడు, గుట్కా, అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. కానీ నేను అలా ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ ఇప్పటికీ చుడిదార్ వేసుకోవాలంటే ఆలోచిస్తుంది. మా నాన్న వలన మా అమ్మ చెల్లి నేను చాల బాధపడ్డాం దాంతో నేను నాన్నను ఇంట్లోంచి బయటకు గెంటేసాను. ఇప్పుడు ఆయనకు ఒక కాలు పోయింది యాక్సిడెంట్ లో. ఐనా ఇప్పుడు మా అమ్మ అతనికి సపర్యలు చేస్తోంది. మా అమ్మ నాన్న వలన పడిన బాధల్ని చూసాను కాబట్టే ప్రియాంక విషయంలో అలా ఉండకూడదు అనుకుంటాను. ఆమె నా వలన బాధపడకూడదు అన్నదే నా తపన. ఆమె ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. కానీ మా నాన్న సైడ్ ఫామిలీ అంతా కూడా చాలా చెత్తగా ఉంటారు. ఆడవాళ్లను పట్టించుకోరు. మా నాన్న వాళ్ళ నాన్నను కూడా కొట్టేవాడు. మంచి భోజనం లేకే మా తాతయ్య చనిపోయాడు. అందుకే నాకు వాళ్ళ ఫామిలీ అంటే విరక్తి వచ్చేసింది.కర్మ అనేది ఉంటుంది. మా నాన్న ఎన్ని చేసాడో ఇప్పుడు అంతా అనుభవిస్తున్నాడు " అంటూ శివ్ తన ఫామిలీ కష్టాలను చెప్పుకొచ్చాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com