ఎవరి లైఫ్ లో ఐనా ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది. అలాగే శివ్ లైఫ్ లో కూడా ఉంది. మౌనరాగం సీరియల్ తో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు శివ్. రీసెంట్ గా ఒక టాక్ షోలో తన లవ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు. "నా ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యింది. ప్రియాంక ఎంత స్పెషలో ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ . కాకపొతే ఆమె నాకంటే 6 ఏళ్ళు పెద్ద. నేను 20 ఎల్లప్పుడే లవ్ లో పడ్డాను. మూడేళ్లు బాగానే ఉంది. ప్రెజెంట్ నా వయసు 29. ఈ విషయం ప్రియాంకకు కూడా తెలుసు. మౌనరాగం టైములో నేను ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాను. ఒక అబ్బాయి లైఫ్ లో ఫస్ట్ లవ్ అన్నది ఎప్పుడూ స్పెషలే . ఆమె చాలా మెచ్యూర్డ్ నేను చాలా తక్కువ . మౌనరాగం సీరియల్ టైములో ఒక రోజు చాలా ఫీవర్ వచ్చింది.
అదే రోజు ఆవిడ బర్త్ డే. సీరియల్ లాస్ట్ డే షూటింగ్ కూడా. ఆ రోజు బెంగళూరుకు వెళ్లాను. ప్రియాంకనే నన్ను నా ఫస్ట్ లవ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన షాల్ ని కూడా నాకు ఇచ్చింది. అలాగే కేక్ కూడా నాకు ఆమె ఇప్పించడానికి తీసుకెళ్లింది. ఆరోజు ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరికీ కలిపి ఒక ఫ్లయిట్ బుక్ చేశారు. ఆరోజు ఆమె కోసం ఎవరూ రాకపోతే మా డ్రైవర్ వచ్చాడు. మేడం రండి మా డ్రైవర్ వచ్చాడు డ్రాప్ చేస్తాను అని చెప్పాను. అలా ఆమె మా కార్ లో వచ్చింది. ఫస్ట్ నన్నే డ్రాప్ చేయాలి ఎందుకంటే బర్త్ డే కదా నాకు ఇంపార్టెంట్ కూడా. అందుకే నాకు ఆవిడ షాల్ ఇచ్చి కేక్ కొనడానికి హెల్ప్ చేసింది. అలా నా డ్రైవర్ ఫస్ట్ నన్ను డ్రాప్ చేసి తర్వాత ప్రియాంక గారిని డ్రాప్ చేసాడు. నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఆవిడకు 27 ఇయర్స్ నేను 23 ఉన్నప్పుడు ఆవిడకు 30 ఇయర్స్. ఐతే ఇప్పుడు ఆవిడకు పెళ్ళై ఒక పాప ఉంది. ఆవిడకు పాప పుట్టిందన్న విషయం గురించి చెప్పిందే ప్రియాంక నాకు. ఆవిడతో బ్రేకప్ అయ్యాక నేను చాలా ఏడ్చాను. ఐతే దేవుడు ఏదో మంచే రాసిపెడతాడు ముందు. అందుకే ఇప్పుడే ఏడ్చేయి తర్వాత హాయిగా నవ్వుకోవచ్చు అంటాడు " అని చెప్పాడు శివ్.




