Home

»

Tv News

దేవుడు వరమిస్తే శ్రీముఖితో కలిసి హీరోగా మూవీ చేస్తా....

May 31, 2026 9:46AM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం బాగా అలరించింది. ఎందుకంటే బాచిలర్స్ పార్టీ కాబట్టి. అటు కొంత మంది బాయ్స్ ఇటు కొంత మంది గర్ల్స్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక మధ్యలో శ్రీముఖి ఒక ప్రశ్న అడిగింది. ఒకవేళ దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఎం కోరిక కోరుకుంటారో నాకు లైవ్ లో తెలుసుకోవాలని ఉంది అంటూ శ్రీముఖి అడిగింది. దానికి ముందు దీపికా ఐతే "నేను అకౌంట్ లోంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అకౌంట్ లో అంత డబ్బే ఉండాలి అంటే నా బ్యాంకు అకౌంట్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడుతూ ఉండాలి " అని చెప్పింది. తర్వాత అరియనా ఎం చెప్పింది "నాకొక సెలబ్రిటీ గుడ్ లుకింగ్ బాయ్ ఫ్రెండ్ కావాలి " అని చెప్పేసరికి హరి "సింపుల్ గా హరి కావాలని చెప్పొచ్చుగా" అనేసరికి ఆరియానా గట్టిగా ఇచ్చిపడేసింది "వద్దురా బాబు అన్న అంటావ్ తమ్ముడు అంటావ్ ఆ అమ్మాయిని చూస్తే ఆమె కావాలంటా నీకు ఆకలెక్కువ" అనేసింది. తరువాత దివి "నేను కళ్ళు మూసుకుని ఏ ప్లేస్ కి వెళ్లాలంటే ఆ ప్లేస్ కి వెళ్ళిపోవాలి టైం ట్రావెల్ చేయాలనీ" కోరుకుంటా. తర్వాత హిమజ "ఎంత స్వైప్ చేసినా కార్డులో అమౌంట్ పెరుగుతూ ఉండాలి రోజులు పెరిగే కొద్దీ వయసు తగ్గాలి తినే కొద్దీ వెయిట్ తగ్గాలి" అనేసరికి "దేవుడు అమాంతం అలా వెళ్ళిపోతాడు వద్దమ్మా తల్లి బట్ మంచి కోరికలే చూద్దాం అవ్వుద్దో లేదో" అంది.

తర్వాత గాయత్ర్హి "ఇదే స్టేజి మీద నీలాంబరి అనే బెస్ట్ రోల్ ఇచ్చారు కాబట్టి నాకు మూవీస్ లో కూడా విలన్ కానీ హీరోయిన్ కానీ మంచి పవర్ ఫుల్ రోల్ చేయాలని కోరిక " అంది. "జరగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను " అంది శ్రీముఖి. తర్వాత బాలు "సినిమా తియ్యాలని కోరిక అలాగే మనిద్దరం కలిసి ఒక చెయ్యాలని కోరిక" అని చెప్పాడు. వెంటనే అవినాష్ "ఒకవేళా మీ ఇద్దరి కలిసి మూవీ చేస్తే నేను డైరెక్షన్  చేస్తా" అన్నాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com