Home

»

Tv News

 శ్రీముఖి యాంకరింగ్ ఆపేసినప్పుడే దివి పెళ్లి జరుగుతుంది

May 31, 2026 9:29AM

ఒక్కొక్కరి పెళ్లి జాతకం గురించి ఒక్కో రేంజ్ లో చెప్పుకొచ్చాడు నూకరాజు. ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో షో జాతకం చెప్పే జ్యోతిష్యుడి గెటప్ లో వచ్చాడు నూకరాజు. ఇందులో దివి జాతకం చెప్పాడు. "దివి గారు నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రీముఖి గారు యాంకరింగ్ ఆపేసినప్పుడు నీ పెళ్లి జరుగుతుంది.ఆలోచించుకోండి ఒక స్త్రీ పెళ్లి నీ చేతుల్లో ఉంది  " అంటూ శ్రీముఖికి  చెప్పాడు. వెంటనే శ్రీముఖి ఇచ్చిన రియాక్షన్ మాములుగా లేదు. "ఈ స్త్రీ పెళ్ళికే దిక్కులేకపోతే ఈ స్త్రీ గురించి ఎందుకు ఆలోచిస్తది ఈ స్త్రీ ..నేను ఆపను యాంకరింగ్ " అని కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి.

దివి పెళ్లి గురించి దివ్యదృష్టితో చూసి చెప్పాలి ఆమ్మో ఆమె పెళ్లి రోడ్డు మీద జరుగుతుంది ...ఆమె లేచిపోయి నడిరోడ్డు మీద పెళ్లి చేసుకుంటుంది. ఈవిడ పెళ్లి ఎవరితో జరుగుతుందో తెలుసా చాలా డబ్బులున్న అబ్బాయితో జరుగుతుంది. పెళ్ళైన తర్వాత ప్రతీ రోజూ పండగే నీకు తెలుసా" అని నూకరాజు అనేసరికి " వావ్ నాకూ  అదే కావాలి " అనేసింది దివి. దాంతో అందరూ నవ్వేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీలో దివి రోల్ అందరికీ గుర్తుండిపోయింది. మహేష్ బాబు ఫ్రెండ్ రోల్‌లో ఈమె నటించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో   అందరినీ అలరించింది.  మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీలో కూడా నటించింది దివి. ఇక ఇప్పుడు ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది కానీ సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఫాన్స్ తో టచ్ లోనే ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com