'చిన్నారి పెళ్లికూతురు 2'లో సరికొత్త ఆనంది ఈమే!
on Dec 3, 2021

ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న బిగ్గెస్ట్ నేమ్స్‌లో శివంగి జోషి ఒకటి. ఇటీవలే ఆమె పాపులర్ టీవీ షో 'బాలికా వధు 2' (చిన్నారి పెళ్లికూతురు 2)లో పెరిగి పెద్దదైన ఆనంది పాత్రలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఆమె 'యే రిష్తా క్యా కెహ్‌లాతా హై' సీరియల్‌లో సీరత్/ నైరా పాత్రలో కనిపించింది. ఆరేళ్లపాటు అందులో హీరోయిన్‌గా నటించాక, దాన్నుంచి బయటకు వచ్చేసింది శివంగి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ వస్తోంది. ఇంతకాలం ఆమె ఇండస్ట్రీలో ఉండటంతో ఆమె ఏజ్ 26 లేదా 27 ఏళ్లు ఉంటుందని జనాలు అనుకుంటున్నారు. కానీ ఆమె వయసు అంత కాదు.
Also read: రోజాకు అడ్డంగా దొరికి పోయిన జబర్దస్త్ జోడీ!
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వికీపీడియాలో తన వయసు 26 లేదా 27 ఏళ్లు ఉంటుందని వెల్లడించడం కరెక్ట్ కాదని చెప్పింది శివంగి. దాన్ని సరిచేయడానికి పలుసార్లు ప్రయత్నించినా కుదరలేదని ఆమె వెల్లడించింది. "అయితే ఏదో ఒకరోజు ఆ వయసుకు వస్తాను. ఈలోగా నేను సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు నా వయసు 23 సంవత్సరాలే" అని ఆమె వెల్లడించింది.
Also read: బిగ్‌బాస్‌పై రవి సంచలన కామెంట్స్!
సో.. ఇప్పుడు జనాలకు శివంగి అసలు వయసెంతో తెలిసిపోయింది. అంటే మనం ఊహించినదాని కంటే ఆమె చాలా చిన్నదన్న మాట. ఆసక్తికరమైన విషయమేమంటే, 'బాలికా వధు 2'లో ఆమె 17 ఏళ్ల ఆనంది పాత్రను పోషిస్తోంది. ఆనంది పాత్ర గతంలో తాను పోషించిన పాత్రల కంటే చాలా భిన్నంగా ఉంటుందనీ, ఆనందికీ తనకూ మధ్య చాలా పోలికలున్నాయనీ శివంగి చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



