సూపర్ మాన్ గా ఊహించుకుంటూ ఉంటాను.. ఆర్మీలో కానీ పోలీస్ ఫోర్స్ లో కానీ ఉండేవాడిని
on Jul 1, 2025
.webp)
మంచు విష్ణు హీరోగా రీసెంట్ గా కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచు విష్ణు, మోహన్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే విష్ణు ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసాడు. అందులో ఇలాంటి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ చెప్పాడు. "మీకు సౌత్ ఇండియన్ డిషెస్ లో ఏది ఇష్టం" అనడంతో "దోస" అన్నాడు. "ప్రజలు మీ గురించి అనుకునే ఏ విషయం కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటారు" అన్నారు. "ప్రజలు నన్ను గుడ్ పర్సన్ అనుకుంటారు" అనేసరికి "అంటే మీరు గుడ్ పర్సన్ కాదా" అని రివర్స్ లో మళ్ళీ అడిగారు. "నేను గుడ్ పర్సన్ నీ కానీ డర్టీ మైండ్ నాది " అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "సండే వస్తే మంచు వారి ఇంట్లో బ్రన్చ్ ఎలా ఉంటుంది" అని అడగడంతో "లైక్ రెస్టారెంట్ లా ఉంటుంది" అని చెప్పాడు. " ఇంట్లో ఆర్గుమెంట్స్ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు..నిజం చెప్పండి" అని అడిగారు.
" నేను ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాను" అన్నాడు. "ఏ హీరోతో నటించాలని ఉంటుంది ఎప్పుడూ మీకు" అన్నారు. " మిస్టర్ మోహన్ లాల్ " అన్నాడు. "ఎలా ఉండాలంటే మీకు భయం.. ప్రొడ్యూసర్ ఉండడానికా లేదంటే ఒక పేరెంట్ గా ఉండడానికా" అన్న ప్రశ్నకు "పేరెంట్ గా ఉండాలంటే భయం వేస్తూ ఉంటుంది " అన్నాడు. " మీ మొబైల్ లో అన్ రీడ్ వాట్సప్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి" అని అడిగారు. "జీరో " అని చెప్పాడు. "యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటే మీరు ఈరోజున ఎం చేస్తూ ఉండేవాళ్ళు" అన్న ప్రశ్నకు "ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ పని చేస్తూ ఉండేవాడిని" అని చెప్పాడు. "మీలో ఎవరికీ తెలియని సీక్రెట్ టాలెంట్ ఏదైనా ఉందా" అని అడిగారు. "నేను ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతూ ఉంటాను లేదంటే నన్ను నేను అంతకు మించి సూపర్ మాన్ గా ఊహించుకుంటూ ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాను" అని చెప్పాడు మంచు విష్ణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



