ENGLISH | TELUGU  
Home  » TV News

మరదలితో గంగులు సాంగ్ కి డ్యాన్స్ చేసిన మానస్! 

on May 17, 2023

మానస్ నాగులపల్లి.. బిగ్ బాస్ ఎంట్రీతో గుర్తింపు తెచ్చుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' సినిమాలో తొలిసారి చేసాడు. ఆ తర్వాత బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ ద్వారా పరిచయమయ్యాడు. బిగ్ బాస్-5 ఎంట్రీ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు మానస్. ఆ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్ గా నిల్చాడు మానస్. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మానస్ కి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. రీసెంట్ గా ప్రైవేట్ ఆల్బమ్ అయిన 'జరీ జరీ పంచె కట్టు' సాంగ్ కి  మానస్, విష్ణుప్రియ కలిసి డాన్స్ చేసారు. ఈ సాంగ్  ఎంత ట్రెండ్ సెట్ చేసిందో అందరికి తెలిసిందే. 

అయితే తాజాగా మానస్, విష్ణుప్రియ కలిసి మరో పాటతో మనముందుకొచ్చారు. వీరిద్దరూ కలిసి  'గంగులు' పాటకి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసారు. కాగా ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. మానస్ అటు ఆల్బమ్ సాంగ్స్, ఇటు ఈవెంట్స్.. మరొకవైపు బ్రహ్మముడి సీరియల్ తో బిజీ లైఫ్ ని గడుపుతున్నాడు. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ పాత్రలో మానస్  నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్రహ్మముడి సీరియల్ లో రాజ్-కావ్యలు పెళ్లి చేసుకోగా.. కావ్యకి అక్కగా స్వప్న అలియాస్ హమీదా చేస్తుంది. హమీదా కూడా బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చిన సెలబ్రిటీ. హమీదాకి తెలుగులో మొట్టమొదటి సీరియల్ బ్రహ్మముడి కావడం విశేషం. హమీదా, మానస్ లు మంచి స్నేహితులు. అయితే తాజాగా మానస్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'గంగులు' పాటకి..  హామీద, మానస్ లు కలిసి  డాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియోని హమీదా, మానస్ ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మానస్, హమీదా కలిసి షేర్  చేసిన ఈ వీడియోని చూసిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్... నైస్ షేడ్స్ అంటూ కామెంట్ చేశాడు‌. అయితే మరొకరు.. మరదలితో రీల్స్ ఏంటి మానస్.. కావ్య ఫీల్ అవ్వదా అని కామెంట్ చేసారు. మీరే అన్నారు కదా మానస్ అని, మానస్ కాబట్టి చేశాను.. అదే రాజ్ అయితే చెయ్యడు కదా అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు మానస్. ఇలా వీరిద్దరు కలిసి చేసిన ఈ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.