శ్రీదేవి నాకు పిన్ని అవుతుంది.. కానీ?
on Jan 18, 2022
'అమ్మాయి కాపురం' సినిమాతో వెండితెరకు పరిచయమైన మహేశ్వరి.. 'గులాబి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అలరించింది. ఇదిలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవికి మహేశ్వరి బంధువు అనే సంగతి తెలిసిందే. అయితే వీరి బంధుత్వం గురించి చర్చలు జరుగుతుంటాయి. శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుందని కొందరు, మేనకోడలు అవుతుందని మరికొందరు అంటుంటారు. శ్రీదేవితో తనకున్న బంధుత్వంపై తాజాగా మహేశ్వరి క్లారిటీ ఇచ్చింది.
ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోకి మహేశ్వరి గెస్ట్ గా వచ్చింది. జనవరి 24 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది. శ్రీదేవికి మహేశ్వరి ఏమవుతారు అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది అని ఆలీ అడగగా.. శ్రీదేవి తనకు చిన్నమ్మ(పిన్ని) అవుతారని, కానీ తనకు అక్క అని పిలవడం అలవాటు అని మహేశ్వరి తెలిపింది. శ్రీదేవి ఇప్పుడు లేదంటే నమ్మబుద్ధి కావడంలేదని చెప్పింది.
'గులాబి' సినిమా అంత హిట్ అవుతుందని షూటింగ్ టైంలో అనుకోలేదని మహేశ్వరి తెలిపింది. 'మేఘాలలో తేలిపొమ్మన్నది' షూటింగ్ టైంలో లోయలో పడిపోయామని, అదృష్టం కొద్దీ ప్రమాదం నుండి తప్పించుకున్నామని పేర్కొంది. షూటింగ్స్ లో తాను తక్కువగా మాట్లాడతానని అందరూ తనకి పొగరని పొరపడేవాళ్లు అనే మహేశ్వరి చెప్పుకొచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
