Home

»

Tv News

Podharillu : కేశవను ఇంప్రెస్ చేసేందుకు శైలు రీల్స్.. ప్రతాప్, ఆదిల ప్లాన్‌ను రివర్స్ చేసిన చక్రి!

May 28, 2026 10:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123 లో..... మహాకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి వడ్డీస్తారు. చక్రికి మాత్రం అన్ని దూరం పెట్టి అల్లుడు గారు పెరుగు వేసుకోండి అంటారు. దాంతో చక్రి రివర్స్ ప్లాన్ చేసి.. మావయ్య ఆ ఫిష్ ఫ్రై ఇవ్వండి.. చికెన్ ఇవ్వండి అంటూ ఒక ఆట ఆడుకుంటాడు. మరొకవైపు కేశవని ఇంప్రెస్ చెయ్యాలని శైలు తన అసిస్టెంట్ తో కలిసి రీల్స్ చేస్తుంది. అప్పుడే కేశవ వచ్చి అక్కడ పనులు చెయ్యకుండా ఇవేంటని కోప్పడతాడు.  ఆ తర్వాత ప్రతాప్, ఆది ఇద్దరు కలిసి చక్రిని అవమానించాలని అల్లుడు గారు మనం కష్టసుఖాలు మాట్లాడుకుందామని పిలుస్తారు. వాళ్ళు ఇద్దరు పైన కూర్చొని ఉంటారు.. చక్రిని మాత్రం కింద కూర్చొమని చెప్తారు.

ఆ తర్వాత మహా వస్తుంది. ఏంటి చక్రి కింద కూర్చొని ఉన్నాడని అంటుంది. ఏం లేదు అమ్మ స్కూల్ లో అల్లరి చేసేవాడిని అంటూ చెప్తున్నాడని ప్రతాప్ అంటాడు. మరి ఏదో గట్టిగా వినిపించిందని  మహా అంటుంది. అల్లుడు గారు మిమిక్రి చేస్తున్నాడని ప్రతాప్ అనగానే అవునా ఒకసారి చెయ్యండి అని మహా అనగానే కొన్ని మిమిక్రీ చేసి ఇది కుక్కది.. ఇది పందిది అని ఆది, ప్రతాప్ ని ఉద్దేశ్శించి చక్రి అంటుంటే.. వాళ్ళకి కోపం వస్తుంది. ఆ తర్వాత మహా తన గదిలోకి వెళ్లి అంతా చూసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మహా నువ్వు మీ నాన్నకి నిజం చెప్పి ఇక్కడే ఉండొచ్చు కదా అని హారిక అంటుంది. లేదు వదిన అక్కడ నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయని మహా అంటుంది.

ఆ తర్వాత కేశవకి చక్రి ఫోన్ చేసి అక్కడ జరుగుతుంది మొత్తం చెప్తాడు. ఇక్కడ అందరు మహాలక్ష్మి ముందు ఒకలా.. లేకముందు ఒకలా ఉంటున్నారని చక్రి చెప్తాడు. జాగ్రత్తగా ఉండమని కేశవ చెప్తాడు. అప్పుడే మహా వచ్చి కేశవతో మాట్లాడుతుంది ఇంట్లో అందరితో మాట్లాడాలి వీడియో కాల్ చెయ్యమని అంటుంది. అందరితో వీడియో కాల్ లో మహా మాట్లాడుతుంది. ఆ తర్వాత నిద్ర వస్తుంది పదండి నా గదిలో పడుకుందామని మహా అనగానే ఏంటి మీరు నన్ను మీ గదిలో పడుకోమని చెప్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com