.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -280 లో.....విశ్వ శాలువా, బొకేతో ఇంటికి వస్తాడు. ఏంటి అండి ఏదో సన్మానం జరిగినట్లు ఉందని సుధా అడుగుతుంది. అవును ఇంకొక విషయం ఏంటంటే ఉమెన్ బాక్సింగ్ కాంపిటిషన్ కి సెలక్టర్ గా నన్ను అప్పాయింట్ మెంట్ చేశారని విశ్వ చెప్పగానే సుధా డల్ అవుతుంది. ఏంటి ఇది నీకు గుడ్ న్యూస్ కాదా అని విశ్వ అడుగుతాడు. నేను ఎందుకు డల్ గా ఉన్నానో తెలియదా అని సుధా అడుగుతుంది. మీకు అసలే గంగ అంటే పడదు ఆ కారణం చేత మీరు గంగని రిజెక్ట్ చేస్తారేమోనని సుధా అనగానే అలాంటివి నేను పట్టించుకోను రూల్స్ పాటిస్తాను.. డిసిప్లేన్ ఉంటే అందరిని ఎంకరేజ్ చేస్తానని విశ్వ అంటాడు.
మరొకవైపు గంగ తనకి నచ్చిన ఫుడ్ తింటుంది. అప్పుడే గంగకి సుధా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ని రుద్ర లిఫ్ట్ చేస్తాడు. మీ మావయ్య బాక్సింగ్ పోటీకి సెలక్టర్ గా ఎంపిక అయ్యాడంట అని సుధా చెప్తుంది. గంగ అంటే అసలే కోపం తనని బాక్సింగ్ బాగా ప్రాక్టీస్ చెయ్యమని సుధా చెప్తుంది. మరొకవైపు సూర్య తన బిజినెస్ ని విస్తరించుకోవడానికి పెద్దసారుని డబ్బు అడుగుతాడు. ఆ కంపెనీలో డబ్బు పెట్టడం వల్ల నష్టమే అని రుద్ర అంటాడు. నేను ఎవరిని సలహా అడగడం లేదు.. పెద్దనాన్న మీకు ఇష్టం అయితే ఇవ్వండి లేదంటే లేదని సూర్య అంటాడు. అయినా మేం అడిగేది మాకు వచ్చే వాటా నుంచి అని ఇషిక అనగానే.... ఇషిక ఏం మాట్లాడుతున్నావని ఇందుమతి కోప్పడుతుంది. ఇందుమతి నువ్వు సైలెంట్ గా ఉండు మీకు కావల్సిన డబ్బు ఇస్తానని పెద్దసారు చెప్తాడు. దాంతో ఇషిక, సూర్య హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత పెద్దసారు దగ్గరికి రుద్ర వస్తాడు. సూర్య, ఇషికకి పెద్దగా బిజినెస్ తెలియదు.. వాళ్ళని నమ్మి అంత డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదని రుద్ర అంటాడు. ఇషిక మాటలు చూసావా.. వాటాల దాకా వచ్చాయి.. ఇప్పుడు నేను డబ్బు ఇవ్వనంటే ఇషికకి వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన వస్తుంది.. ఏం చేసిన మంచి జరగాలి అనుకుందామని పెద్దసారు అంటాడు. నువ్వు నీ గురించి కూడా ఆలోచించాలి.. గంగ ఇక్కడ సంతోషంగా ఉన్నా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుందని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత విశ్వ నాథ్ గురించి పెద్దసారుకి చెప్తాడు రుద్ర. విశ్వ చాలా మొండిగా ఉంటాడు కానీ మంచివాడు అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత రుద్ర కంటే ముందే గంగ లేచి ప్రాక్టీస్ కి రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
