
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -972 లో... రాజు బస్తీలో నీళ్ల ట్యాంక్ దగ్గర ఆడవాళ్ళతో గొడవపడుతాడు. వాళ్ళు రాజుని కొట్టాలని ట్రై చేస్తారు కానీ రాజు తప్పించుకుంటాడు. ఆ దెబ్బలు తన ఫ్రెండ్ కి తగులుతాయి. ఆ తర్వాత రాజు నీళ్ల బిందె తీసుకొని ఇంటికి వెళ్తాడు. రేపటి నుండి నీళ్లకి వెళ్ళను నాన్న.. ఆ ఆడవాళ్ల తో టార్చర్ భరించలేకపోతున్నానని రాజు అంటాడు. నిన్ను భరించలేకపోతన్నామని మీ అమ్మకి కంప్లైంట్ ఇచ్చారని రాజు వాళ్ళ నాన్న అంటాడు. ఇప్పుడు అంటే ఇలా అంటున్నావ్.. నీ పెళ్ళాం వచ్చాక తప్పదుగా అని అతను అంటాడు. పెళ్ళాం వచ్చాక కూడా వాడు ఇంకా బస్తీలోనే ఎందుకు ఉంటాడని వాళ్ళ అమ్మ అంటుంది.
కరెక్ట్ గా చెప్పావ్ అమ్మ.. నాకు కాబోయే మహారాణి కోటలో కాళ్ళు పట్టించుకుంటూ ఉంటుందని రాజు అనగానే నీకు ఊహలు బానే ఉన్నాయి రా అని అతను అంటాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ ఫోటోస్ ని ఇందు క్లీన్ చేస్తుంది. అప్పుడే స్వాతి వచ్చి అక్క నాకొక డౌట్ ఉందని తన చెయ్ పట్టుకొని లాక్కొని వెళ్తుంటే రుద్రాణి ఫోటో కింద పడిపోతుంది. దాంతో భ్రమరాంబ తనపై కోప్పడుతుంది. అప్పుడే రేఖ వచ్చి మా అమ్మ ఫోటోనే పగులగొడతావా నీ సంగతి చెప్తానని ఇందుని రేఖ కొట్టబోతుంటే అపర్ణ ఆపుతుంది. మీ అమ్మ ఫోటోనే కదా ఏం పర్వాలేదు.. మీ అమ్మ ఇంటికి చేసిన ద్రోహానికి అసలు తనకి సంబంధించిన ఒక్క వస్తువు ఉండకూడదని అపర్ణ అంటుంది. అక్కడ ఉంది కావ్య కూతురు.. కావ్య మీ అమ్మని ఏం చేసిందో గుర్తుందిగా ఇందుకి కోపం వస్తే కూడా అలాగే ఉంటుందని అపర్ణ, సుభాష్ అంటారు. మీకు ఎంత దైర్యం వచ్చింది. దాన్ని చంపెయ్యాలని తన భర్త భూషణ్ ని పిలిచి వీల్ చైర్ లో ఉన్న సుభాష్ ని బయటకు పడేయ్యమని చెప్తుంది. దాంతో అతను పడేస్తాడు. అపర్ణ, ఇందు వెళ్లి సుభాష్ ని లేపుతారు.
మా నానమ్మ తరుపున సారీ అని ఇందు చెప్తుంటే.. అపర్ణ వద్దని అంటుంది. నువ్వు ఏమైనా మాట్లాడితే నా మీద ఒట్టే అని ఇందు అంటుంది. రేఖకి ఇందు సారీ చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందు, సుభాష్ దగ్గరికి స్వాతి వెళ్లి ఆ ఫోటో నా వల్లే పడిందని చెప్పొచ్చు కదా అక్క అని అంటుంది. అలా చెప్తే నీకు తిట్లు ఉండేవి అని ఇందు అంటుంది. దాంతో అందరు నవ్వుకుంటారు. నాకు ఒక డౌట్ అక్క అని స్వాతి మళ్ళీ అంటుంది. మరి నీ ఎగ్జామ్ అని అపర్ణ అనగానే రేఖ ఆంటీ ఆఫీస్ కి వెళ్ళాక ఎగ్జామ్ కి వెళ్తాను.. టైమ్ ఉందని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఇందు(కావ్య) వెళ్తున్న కార్ కి రాజు డాష్ ఇచ్చి డబ్బు కట్టమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






