Home

»

Tv News

Mad for each other: ఒక్కో జంటది ఒక్కో తీరు

Mar 07, 2026

మాడ్ ఫర్ ఈచ్ అదర్  లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఒకరికొకరు ప్రేమను పంచుకుంటే ఆ కపుల్ ని మేడ్  ఫర్ ఈచ్ అదర్ అంటాం . ఒకరి కోసం ఒకరు ప్రేమను గెలిపించుకుంటే ఆ కపుల్ ని మనం మాడ్  ఫర్ ఈచ్ అదర్" అని శ్రీముఖి చెప్పింది. ఇంతలో శివ్ కుమార్ - ప్రియాంక జైన్ వచ్చారు. " ఏదైనా షోలో శివ్ వేరే అమ్మాయితో డాన్స్ చేసినప్పుడు నువ్వెలా ఫీలవుతావ్" అంటూ ప్రియాంకను అడిగాడు జడ్జి అనిల్ రావిపూడి. ఒక సుత్తి తీసుకుని ఒక మీటర్ ని బద్దలు కొట్టింది ప్రియాంక జైన్ . "నీ ఫ్యూచర్ నాకు బాగా అర్ధమయ్యింది అంటూ చెప్పాడు అనిల్ రావిపూడి. తర్వాత నూకరాజు - ఆసియా వచ్చారు. "ఎయిట్ ఇయర్స్ నుంచి డేటింగ్ అంటే అదొక బిగ్ డీల్ " అంది రాధ. "బిగ్ డీల్ ఏంటి మేడం చాలా సార్లు కళ్ళు కూడా పట్టుకున్నా " అన్నాడు నూకరాజు. తర్వాత వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ వచ్చారు. "బాడీని ఎలా కంటిన్యూ చేస్తారు ...ఎందుకంటే జిమ్ లేదు కదా" అంది శ్రీముఖి. "మా ఆవిడని ఎత్తుకుని పుషప్స్ చేస్తా " అన్నాడు పవన్ కళ్యాణ్. దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత జాను - భాను , బ్రిట్టో - సంధ్య వచ్చారు. "లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా " అని బ్రిట్టోని అడిగింది శ్రీముఖి.

 "ఆఫ్టర్ షూటింగ్ కార్ డ్రైవింగ్ " అంటూ తన లవ్ స్టోరీ చెప్పబోతుంటే ఓ డ్రైవరా మీరు అని అనేసింది శ్రీముఖి. తర్వాత సోనియా - సిద్దు వచ్చారు. "మీ కరెంటు రిలేషిప్ స్టేటస్ ఏంటి " అని అడిగింది శ్రీముఖి.  అంటే "వి ఆర్ మ్యారీడ్" అని సోనియా చెప్పింది. సిద్దు "ఇన్ అవర్ హెడ్ " అన్నాడు సిద్దు. "మీ జంటను చూసాక ఒక గొప్ప విషయం నేర్చుకున్నా మెంటల్లీ మ్యారీడ్ అనే కొత్త పదం బాగుంది" అని చెప్పాడు జడ్జ్ అనిల్ రావిపూడి. తర్వాత సాండ్రా - మహేష్ వచ్చారు. "సెకండ్ ఛాన్స్ అని ఎందుకు చెప్తున్నావ్" అని అడిగింది శ్రీముఖి. "అందరికీ తెలిసినట్టు నాకు ఇంతకు ముందే పెళ్లయ్యింది. కొన్ని కారణాల వలన నేను డివోర్స్ తీసుకున్నాను. అప్పుడు నేను చాల బాధపడ్డాను నా లైఫ్ లో ఎవరూ దొరకరు అనుకున్నాను. అప్పుడు మహేష్ నా లైఫ్ లోకి వచ్చాడు అది కూడా దేవుడి అనుగ్రహంతోనే " అని చెప్పింది సాండ్రా. తర్వాత నటరాజ్ - నీతూ వచ్చారు.

"నీతూ నీ లైఫ్ లో బెస్ట్ వైఫ్ అనుకుంటున్నావా " అని జడ్జ్ లయ అడిగింది. "ఆమె లేకపోతె నటరాజ్ అనేవాడే లేడు" అని చెప్పాడు.  తర్వాత  మాస్క్ మాన్ హరీష్ - హరిత వచ్చారు.  "మగాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం చాలా తప్పు" అంటూ హరీష్ హరిత కాళ్ళ మీద పడ్డాడు". తర్వాత అంజలి - పవన్ వచ్చారు. "నేను బతికున్నంత వరకు ఏ యానివర్సరీ నేను మిస్ చేయను " అని చెప్పాడు పవన్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com