Home

»

Tv News

Brahmamudi : రాజుని తిట్టేసిన వాళ్ళ నాన్న.. ఇందు ఎగ్జామ్ కి వెళ్తుందా!

Mar 07, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -973 లో.. రాజు తమ్ముడు అద్దం ముందు రెడీ అవుతుంటే రాజు వెళ్లి పక్కకు జరగరా అని తోస్తాడు. ఇప్పుడు నువ్వు రెడీ అయి ఏం చేస్తావ్ రా వెంకటేశ్వర్లు అని రాజు అనగానే అలా పిలవకు వెంకీ అని పిలువు ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్య అని అతను అంటాడు. ఎలా పిలిచినా నీ పేరు మారదు.. జీవితం మారదని రాజు అంటాడు. వాడు చిన్న వయసులోనే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ.. నాకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు బలాదూర్ లాగా తిరుగుతున్నావని వాళ్ళ నాన్న అంటాడు.

రాజుకి వాళ్ళ అమ్మ దోసెలు వేస్తుంది. అప్పుడే రాజు ఫ్రెండ్ వస్తాడు. ఇద్దరు కలిసి దోసెలు తింటుంటే వాళ్ళ నాన్న తిడతాడు. ఏదో బిజినెస్ అంటున్నావ్.. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వాళ్ళ నాన్న తెగేసి చెప్పగానే రాజు కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు రేఖ తన భర్త భూషణ్ టిఫిన్ చెయ్యడానికి రెడీ అవుతాడు. ఇందు దోస వేస్తుంటే.. నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని రేఖ చెప్పగానే ఇందు ప్రిపేర్ చేస్తుంది. ఆ చక్రితో మాట్లాడవా కొన్నిరోజులు ఆగమని చెప్పు.. నువ్వు నాకు ఆ ఆస్తి కొట్టేయ్యడంలో తోడు ఉంటావని పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు అప్పు చేస్తున్నావని భూషణ్ పై రేఖ కోప్పడుతుంది . ఈ ఒక్కసారి చక్రితో మాట్లాడమని భూషణ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఈ రోజు రేఖ ఆంటీ వెళ్లడం లేదేంటి నాకు ఎగ్జామ్ టైమ్ అవుతుందని ఇందు అనుకుంటుంది. రేఖ ఆంటీ ఇంకా ఐశ్వర్య లేవలేదని చెప్తుంది. అవునా అంటూ రేఖ అక్కడ నుండి ఐశ్వర్య దగ్గరికి వెళ్తుంది.

హమ్మయ్య ఇప్పుడు రేఖ ఆంటీ ఐశ్వర్యని తీసుకొని వెళ్తుందని ఇందు అనుకుంటుంది. స్వప్న కూతురు ఐశ్వర్య డాన్స్ చేస్తుంటుంది. ఇక రేఖ వచ్చేసరికి చదువుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ఆ విషయం రేఖకి అర్థం అవుతుంది. వెళ్లి త్వరగా రెడీ అవ్వు ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తానని అంటుంది. దీనికి అన్ని మా అన్నయ్య బుద్ది మా అమ్మ తెలివి వచ్చిందని రేఖ మురిసిపోతుంది. మరొకవైపు ఇందు దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే స్వాతి వచ్చి ఇందుని ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత ఇందు హాల్లో క్లీన్ చేస్తుంటే స్వాతి తన బట్టలు తీసుకొని వెళ్లి ఈ బట్టలు స్టిచ్చింగ్ కి ఇచ్చేసి రా అని స్వాతి వాళ్ళ అమ్మ భ్రమరాంబ ముందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com