
బుల్లితెర మీద కొత్త కొత్త షోస్ రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 9 రెడీ అవుతోంది. ఆడిషన్స్ కి సిద్ధం కావాలంటూ వర్ష ప్రోమోలో చెప్పింది. వర్షతో పాటు ఈర్య, వరుణవి తోడయ్యారు. "ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ " అంటూ వర్ష బతిమాలుకుంటుంటే ఈర్య వచ్చి " నాతో ఫోటో దిగడానికి ఇంతలా అడగాలా ఇస్తాలే" అంది. "నీతో ఫోటో కాదు " అంది వర్ష. "నాతో పాట పాడడానికే కదా. ఎప్పుడన్నా డ్యూయెట్ ఉన్నప్పుడు పాడదాం" అంది వరుణవి. "డ్యూయెట్ ఏంటి" అని వర్ష అడిగేసరికి "నువ్వు అబ్బాయివి కదా మనిద్దరం కలిసి పాడితే డ్యూయెట్ కదా" అంది . "నేను అబ్బాయిని కాదు అందమైన ఆడపిల్లను" అంది వర్ష.
"గ్రేట్ ఒకేసారి రెండు జోక్స్ వేశావు " అంది ఈర్య. "అబ్బాయి కాదు అన్నది ఓకే ఇంకోటి ఏంటి" అని వరుణవి అడిగింది. "అందమైన అమ్మాయి అంది కదా " అంటూ యాక్షన్ చేసి చూపించింది ఈర్య. "హలో మీరు నన్ను ఆడుకుంది చాలు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ " అంది వర్ష. "నా కంటెస్టెంట్ గా చేయడానికే కదా మంచి పేమెంట్ ఇచ్చి పెట్టుకుంటాలే" అంది వరుణవి. "అర్ధమయ్యింది... నాకు మేకప్ చేయడానికే కదా" అంది ఈర్య. "హలో ఒక్క ఛాన్స్ నేను అడగట్లేదు. ఒక్క ఛాన్స్ నేను ఇస్తా అంటున్నా. అదెలా అన్నారు పిల్లకాయలు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్ ఈసారి నేను చేయబోతున్నాను. మీ ఇద్దరికీ పోటీగా కాబోయే సూపర్ స్టార్స్ ని నేను తీసుకొస్తున్నాను. ఈ మార్చ్ 15 నేను వస్తున్నా మీ విజయవాడకు గెట్ రెడీ" అని చెప్పింది వర్ష.






