Home

»

Tv News

సమంత పక్కన ఛాన్స్ అనగానే నో చెప్పలేదన్న శ్రీముఖి!

May 26, 2026 5:28PM

బుల్లితెర మీద శ్రీముఖి ఒక సెన్సేషన్. ఆమె ఉంటే చాలు ఆ షోకి రేటింగ్ పీక్స్ అంటారు. ఇక ఆమె ఏ షో చేసిన నవ్వులు, హడావిడి, పంచులు ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇప్పుడు శ్రీముఖి లేటెస్ట్ గా నందిని రెడ్డి తీసిన "మా ఇంటి బంగారం" మూవీలో చిన్న కోడలు రోల్ లో నటించింది. ఈ మూవీ జూన్ 19 నా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ సెలెబ్రేషన్స్ లో శ్రీఎముఖి చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "నీకేమనిపించి ఈ మూవీని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావ్ " అని సమీరా భరద్వాజ్ అడిగింది. సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి  కారణం అవసరం ఉండాలా అండి. సమంత పెద్ద కోడలు నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రి ఉంటుందని చెప్పేసి ఓకే అన్నాను.

టీవిలో లౌడ్ స్పీకర్ ని కావొచ్చు సినిమాలో కోడలు పిల్లను పెళ్లయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను . ఈ మూవీలో వయోలెన్స్ సామ్ కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. సైలెంట్ గా ఉండడం చాలా కష్టంగా ఉంది. ఈ సినిమాను హార్ట్ ఫుల్ గా ఒప్పుకోవడానికి కారణం సామ్ బంగారం. నేను ఆవిడ ఫ్యాన్ . ఆవిడ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆవిడ ఎంత బంగారమే అందరికీ తెలుసు.  ఆవిడ యాక్షన్ లైవ్ లో చూద్దామని అనుకున్నాను బట్ ఆవిడతో పాటే ఇలాంటి ఒక యాక్షన్ ఫిలింలో నటించడం చాలా లక్కీ నేను.  " అంటూ తనకు అవకాశం ఇచ్చిన నందిని రెడ్డికి థ్యాంక్స్ చెప్పింది శ్రీముఖి.  ఇక ఈ మూవీలో ఒక చిన్న సీన్ వైరల్ అవుతోంది.   గౌతమీ తన కోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ "అనసూయ మా చిన్న కోడలు మా ఇంటి బంగారం" అంటూ చెప్పింది. ఇంకో మేల్ క్యారెక్టర్ వచ్చి "అనసూయతో నీకు కాంపిటీషన్ వద్దు తల్లి " అంటాడు. "ఒక్కొక్కరినీ కొడతాను చూడు ప్రేమతో అత్తా " అంటూ సామ్ చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com