Home

»

Tv News

Jayam serial : ప్రమీలపై కార్తీక్ లవ్ మ్యాటర్ లీక్.. స్కెచ్ ఆర్టిస్ట్ రఘురామ్ దగ్గరకు చేరిన అసలు నిజం!

May 27, 2026 10:56AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -279 లో....ప్రమీలని కార్తీక్ ఇష్టపడుతున్నాడని గంగకి తెలుస్తుంది. ఆ విషయం చెప్పడానికి రుద్ర దగ్గరికి గంగ వెళ్తుంది. సర్ మీకోక విషయం చెప్పాలని గంగ హగ్ చేసుకుంటుంది. ఏంటి ఇది ఇలా చేస్తున్నావ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని రుద్ర అంటాడు. సర్ ప్రమీల అక్కని కార్తీక్ ఇష్టపడుతున్నాడని గంగ చెప్తుంది. ఇక మీరు ఏం చేస్తారో చేయండి అని గంగ అనగానే రుద్ర సరే అంటాడు.

మరొకవైపు కార్తీక్ తో ప్రమీల సరదాగా మాట్లాడుతుంది. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూసి ఎక్కడ రుద్ర వాళ్ళు చూస్తారోనని మక్కమ్ టెన్షన్ పడుతాడు. కార్తీక్, ప్రమీల దగ్గరికి రుద్ర, గంగ వస్తారు. ఏంటి మా గురించి మాట్లాడుకుంటున్నారా అని రుద్ర అడుగుతాడు. అవును సర్ మీ జంట చాల బాగుంటుందని కార్తీక్ అనగానే నువ్వు పెళ్లి చేసుకో.. ఎన్నిరోజులు ఇలా ఉంటావని రుద్ర అంటాడు. చేసుకుంటాను సర్ అని ప్రమీల వంక కార్తీక్ చూస్తాడు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది చాల మంచిది అని ప్రమీలని ఉద్దేశ్శించి రుద్ర చెప్తాడు. నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి నచ్చిందని కార్తీక్ అంటాడు మరి ఆ అమ్మాయికి విషయం చెప్పావా అని రుద్ర అడుగుతాడు. లేదని కార్తీక్ చెప్తాడు అయితే త్వరగా చెప్పమని కార్తీక్ చెప్తాడు. 

మరొకవైపు గంగ చిన్నప్పటి ఫోటో చూస్తూ స్కెచ్ ఆర్టిస్ట్ రఘు రామ్ ఫోటో గీస్తాడు. అప్పుడే ఇషిక వీరు తనని వెతుకుంటూ వచ్చి గంగ చిన్నప్పటి ఫోటో చూపించి ఇప్పుడు ఎలా ఉంటుందో గీయమని అడుగుతారు. ఆమె మీకు ఏమవుతుందని రఘురామ్ అడుగుతాడు. అవన్నీ నీకనవసరం అని వీరు అంటాడు. కొంత డబ్బు ఇచ్చి అయ్యక పిలవండి అని వెళ్ళిపోతారు. ఏంటి సర్ మీరు డబ్బు తీసుకోవడం ఏంటి.. నిన్న వచ్చిన అతను కూడా ఇదే ఫోటో తీసుకొని వచ్చాడని అతని అసిస్టెంట్ అంటాడు. అవును అందుకే డౌట్ వచ్చి ఒప్పుకున్నాను.‌ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇస్తానని రఘురామ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com