Home

»

Tv News

గుడ్డిగా నమ్మడం నా తప్పు... లవ్ చేయనప్పుడు ఎందుకు నా జీవితంలోకి వచ్చావ్

Nov 18, 2026 7:18PM

ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి చాలామంది పెర్ఫార్మర్స్ వచ్చారు. గీతూ రాయల్, శ్రీసత్య, నూకరాజు, పంచ్ ప్రసాద్, నటరాజ్ మాష్టర్, రాము రాథోడ్ వంటి వాళ్లంతా వచ్చారు. వీళ్లంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగంలో ఫేమస్ ఐనవాళ్ళే. ఇక వీళ్లందరినీ ఒక చోటకు తెచ్చి  మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం బాగుంది. ఇక ఈ ప్రోమో కింద జై సుధీర్ అన్న అంటూ ఎప్పటిలాగే సుధీర్ ఫాన్స్ కామెంట్స్ చేశారు. ఇక కొంతమంది ఐతే కొత్తవాళ్లను తీసుకురండి షోకి అంటూ కూడా సలహాలు ఇచ్చారు.

ఈ కొత్త ఎపిసోడ్ లో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ని కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఒక పేపర్ మీద రాసి చింపేసి దాన్ని కాల్చేయాలి అన్నమాట. ఇక ముందుగా చొక్కారపు  స్రవంతి " హెల్త్ నెగ్లిజెన్స్ " అని రాసి చూపించింది. ఈ హెల్త్ నెగ్లిజెన్స్ అన్నది కంటిన్యూగా రిపీట్ అవుతోంది నాకు అని చెప్పింది. తర్వాత శ్రీసత్య "త్వరగా నిర్ణయాలు తీసుకోవడం " . ఇది చేసి నేను రిగ్రెట్ ఫీలవుతున్నాను మా అమ్మ ఇప్పటికీ బాధపడుతోంది  అని చెప్పింది. అష్షు రెడ్డి వచ్చి "బ్లైండ్ ట్రస్ట్ " అని రాసింది. "అంటే గుడ్డిగా నమ్మడం అని చెప్పింది. తర్వాత నటరాజ్ మాష్టర్ వచ్చి "మనీ ఖర్చు చేయడం " అని రాసాడు. పాప పుట్టాక దాని విలువ తెలుస్తోంది అని చెప్పాడు. తర్వాత నూకరాజు వచ్చి "పడవలకు వేసే ఫైబర్ లో వాడతారు దాన్ని తాగేశాడు మా నాన్న " అని చెప్పుకొచ్చాడు. తర్వాత పాగల్ పవిత్ర  వచ్చి "పాస్ట్ లవ్ " అని రాసింది. " ఇది ఒక అన్ టోల్డ్ స్టోరీ. నువ్వు నిజంగా లవ్ చేయనప్పుడు అసలు నా జీవితంలోకి రావడం ఎందుకు ... " అని అడిగింది . తర్వాత వాళ్లంతా వాళ్ళు రాసిన కాగితాలను చింపేసి పక్కనే నిప్పుల్లో వేసేసారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com