.webp)
డెమోన్ పవన్ అంటే చాలు ఒక ఇన్ఫ్లుఎన్సర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తొస్తాడు. అలాగే రీతుతో చెట్టాపట్టాలేసుకుని చేసిన కవర్ సాంగ్స్ చేసిన అల్లరి కూడా ఫాన్స్ కి ఆడియన్స్ కి గుర్తొస్తుంది. అలాంటి డెమోన్ పవన్ రీసెంట్ గా టేస్టీ తేజ నిర్వహిస్తున్న వంటాస్టిక్ కార్యక్రమానికి వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడు. టేస్టీ తేజ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. చదువు, చేస్తున్న ప్రాజెక్ట్స్, డెమోన్ అనే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఇవన్నీ చెప్పాడు.
"నేను చదివింది బిటెక్, ఎంబిఎ .మొదట్లో నేను అథ్లెట్ ని. నేనొక 100 మీటర్స్ స్ప్రింటర్ ని. నేను ఇండియాకి ఒలింపిక్స్ మెడలిస్ట్ అవుదామని అనుకున్నా. కానీ అది అవ్వలేదు. సరైన గైడెన్స్ లేకపోవడం. ట్రైనింగ్ లేకపోయినా ఈ ఐదేళ్ల నుంచి ఫిట్ గా ఉన్నాను అంటే కారణం ఇంతకు రెండేళ్ల పాటు చాలా కష్టపడ్డాను. ఐతే ఈ సైడ్ నేను రావడానికి కారణం నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు మోడలింగ్ షో టైటిల్ విన్నర్ ని అయ్యాను. ఆ తర్వాత యాడ్ షూట్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ వంటి ఆఫర్స్ రావడం వంటివి మొదలయ్యాయి. అందుకే నేను ఎందుకు చేయకూడదు అనుకుని ఎవరి సపోర్ట్ లేకుండా నేను నేర్చుకుని గ్రో అవ్వాలనుకున్నా. అలా ఇండిపెండెంట్ గా డెవలప్ అవ్వాలనుకున్నా . అప్పుడు యాడ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, టీవిలో గెట్ సెట్ ఫిట్ వంటి షోస్ చేస్తూ వచ్చా. నాకు ఎప్పటికైనా రాజులు, క్రికెటర్, సూపర్ హీరో ఇలాంటి రోల్స్ ఏమన్నా అఫర్ వస్తే కచ్చితంగా చేస్తాను. నేను యానిమే సిరీస్ మాంగా చదువుతూ ఉంటాను. అందులో మెయిన్ లీడ్స్ డెమోనిక్ లార్డ్, డెమోనిక్ ఎంపరర్ ఉంటారు. మొదట్లో హీరో వీక్ నుంచి హీరోగా అవుతాడు. నేను కూడా అలా గ్రో అవ్వాలి అలా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి ఆ పేరు పెట్టుకున్నాను. నా లైఫ్ ధూమ్ ధామ్ ధమాకాలా ఉంది. ప్రస్తుతానికి సావిత్రి మూవీ చేసాను దాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నాం. అలాగే ఇంకో మూవీ కూడా చేస్తున్నాను. " అని చెప్పుకొచ్చాడు.





.webp)
