Home

»

Tv News

Jayam serial: గంగ బాక్సింగ్ పంచ్ కి జ్యోతి అవుట్.. పెద్దసారుకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్!

Nov 17, 2026 9:41AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-428లో.. బాక్సింగ్ ఇన్ స్టిట్యూట్ లో కోచ్ వెంకట్ తను ట్రైన్ చేసిన జ్యోతి ప్రాక్టీస్ చేసి వస్తుండగా వారికి విశ్వ, జయ కనపడతారు. నువ్వు చేసి‌న తప్పుకి నిన్ను డిస్ మిస్ చేశాను.  ఇప్పుడు ఈ అమ్మాయిని ట్రైన్ చేశావంటేనే తెలుస్తోంది నీ పూర్ స్కిల్స్ తో ఆమె ఏం నేర్చుకుందోనని విశ్వ అనగానే నా స్కిల్స్ చూసి నా స్టూడెంట్ ను జడ్జ్ చేశారు కాబట్టి నేను కూడా మీ అమ్మాయిని జడ్జ్ చేస్తాను. ఇందాక బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చూశాను.. తనకి పెద్దగా ఇంట్రస్ట్ లేనట్టుగా చిరాకుగా మొహం పెట్టి ప్రాక్టీస్ చేసింది దానిని మీరు పంతం అనుకున్నారు అంతే అని కోచ్ వెంకట్ అనగానే ఇప్పుడు ఏం అంటావ్.. మనమిద్దరం బాక్సింగ్  పోటీ పెట్టుకుందామని అంటావా వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్ అని విశ్వ అంటాడు.

 

పోటీ మనకి కాదు.. మీ అమ్మాయికి, నా స్టూడెంట్ కి అని వెంకట్ అనగానే అందరు షాక్ అవుతారు‌. అప్పుడే జయని ఇరికించాలని గంగ అక్కడికి వస్తుంది. ఏంటి మీరు మాట్లాడేది.‌..మా జయకి ఏం తక్కువ .. తనకి మా విశ్వ సర్ ట్రైనింగ్ ఇచ్చారు.. తను సూపర్ బాక్సింగ్ చేస్తుందంటూ ఇండైరెక్ట్ గా తనని గేమ్ లో దిగేలా చేస్తుంది. అయితే పోటీకి నేను సిద్ధం అని కోచ్ వెంకట్ స్టూడెంట్ జ్యోతి అంటుంది. అయితే మా జయ కూడా పోటీకి సిద్ధంగా ఉంది అని గంగ అంటుంది‌. ఇక పోటీ మొదలవుతుంది. జయని జ్యోతి బాక్సింగ్ లో ఇరగదీస్తుంది. ఇక జయ కిందపడిపోతుందనే సమయంలో గంగ వచ్చి పట్టుకొని తను పోటీలోకి ఎంట్రీ ఇస్తుంది. నువ్వేంటి పోటీలోకి వచ్చావని వెంకట్ , జ్యోతి అంటారు. నేను విశ్వ గారి స్టూడెంట్ అని గంగ అంటుంది. ఇక సరేనని గంగ, జ్యోతి మధ్య పోటీ మొదలవుతుంది ‌ జ్యోతిని గంగ చిత్తుచిత్తుగా కొట్టేసి ఓడిస్తుంది. దాంతో వెంకట్ వాళ్ళు డిస్సప్పాయింట్ అవుతారు‌. ఎందుకు గంగ నువ్వు పోటీలోకి వచ్చావని జయ గర్వంగా అంటుంది‌. నువ్వు ఓడిపోతున్నావని తెలిసి మామయ్య పరువుపోతుందని గంగ వచ్చిందని గంగ వచ్చిందని రుద్ర సపోర్ట్ చేస్తాడు. 

మరోవైపు ఇంట్లో పెద్దసారు  పేపర్ చదువుతుంటాడు. అతడిని చూసిన ఇషిక, వీరు ఒక ప్లాన్ వేస్తారు. అల్రెడీ ఒకసారి హార్ట్ స్టోక్ వచ్చింది కాబట్టి మనం మాటలతో రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేలా చేద్దామని ఇషిక, వీరు ప్లాన్ చేస్తారు. మొదటగా పెద్దసారు దగ్గరికి వీరు వెళ్ళి.. మామయ్య గారు టాబ్లెట్లు వేసుకున్నారా అని వీరు అడుగగా బాగా గుర్తుచేశావ్ వీరు.. గంగ ఉంటే అందరికి అన్నీ సమకూర్చేది.. నాకు టాబ్లెట్లు ఇచ్చేదని పెద్దసారు అనగానే అప్పుడే ఇషిక వచ్చి..నేను వస్తున్నప్పుడు ఆ గంగ గొప్పది.. నేనేం చేయనని మాట్లాడుతున్నారేంటని ఇషిక అంటుంది. అసలు నువ్వు ఏం పని చేస్తావ్.. ఎప్పుడు అయినా ఇంట్లో వాళ్ళకి ఒక కప్పు కాఫీ ఇచ్చావా..గంగ అటు బాక్సింగ్ కోచింగ్, ఇటు వంటపని ఇంటిపని అన్నీ చక్కబెడుతుందని పెద్దసారు అనగానే మీరు నన్ను అవమానిస్తున్నారు.. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ గంగ వచ్చినప్పటి నుండే జరుగుతున్నాయని ఇషిక అనగానే పెద్దసారు ఫుల్ కోపంగా ఊగిపోతూ ఇషిక అని అరిచేసరికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాంతో అతను సోఫాలో పడిపోతాడు. అప్పుడు ఇంట్లోని వాళ్ళంతా పరుగెత్తుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com