ENGLISH | TELUGU  
Home  » TV News

ఆశలన్నీ అడియాశలయ్యాయని ఏడుస్తున్న కృష్ణ.. ఆలోచనలో పడ్డ మురారి!

on Mar 21, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో.. రెండు రోజుల్లో నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకొని వెళ్ళిపోతానని భవానితో చెప్తుంది కృష్ణ. దానికి భవాని ఒప్పుకుంటుంది. ఇక కృష్ణ తన నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపతుండగా.. మురారి వెళ్ళి "బాధపడకు కృష్ణ" అని ఓదార్చుతాడు. "నేను ఏం తప్పు చేశాను సర్.. నందు ఆరోగ్యం బాగుపడాలనే కదా నేను చేసింది" అని కృష్ణ చెప్పుకుంటూ బాధపడుతుంది. "నీకు ఆ టాబ్లెట్స్ మీ గౌతమ్ సర్ ఇచ్చాడా? అయితే డైరెక్ట్ గా వెళ్ళి అతడినే నిలదీద్దాం పదా" అని మురారి అనగానే.. నేను టాబ్లెట్స్ ఇచ్చినట్లు ఎవరికి చెప్పొద్దని గౌతమ్ సర్ అన్నాడని మనసులో అనుకొని. వేరొక డాక్టర్ ఇచ్చాడని కృష్ణ చెప్తుంది.

మరోవైపు నందుకి జ్యూస్ తీసుకొని ముకుంద వెళ్తుంది. నందు లేచి సిద్దు సిద్దు అని పిలుస్తుంటుంది. ఎవరు లేరు నందు అని ముకుంద అంటుంది. జ్యూస్ తాగు నందు  అని ముకుంద అడుగగా.. నేను తాగనని నందు అంటుంది. ఈ పిల్ల ఆ కృష్ణకి బాగా అలవాటయిందని అనుకొని భవానికి చెప్పడానికి తన దగ్గరికి వెళ్తుంది ముకుంద. "సిద్దు సిద్దు అని నందు అంటుంది. ఎవరు అత్తయ్య" అని భవానిని అడుగుతుంది ముకుంద. అతను తన చిన్ననాటి ఫ్రెండ్.. ఎప్పుడు అతని పేరే కలవరిస్తుందని భవాని అంటుంది. ముకుంద కూడా భవాని చెప్పిందే నమ్ముతుంది. మరోవైపు కృష్ణ బాధపడుతుంటే.. ఎక్కువగా ఆలోచించకు కృష్ణ అని మురారి అంటాడు. "నేను గౌతమ్ సర్ ని ఎంతో నమ్మాను. నా ఫోన్ కూడా ఎత్తడం లేదు.. నా ఆశలన్ని అడియాశలయ్యాయి" అని కృష్ణ అనగానే.. ఏంటి కృష్ణ నా ముందే ఇలా మాట్లాడుతుంది. వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందని మురారి ఆలోచనలో పడతాడు.

ఆ తర్వాత కాలేజీకి వెళ్తున్న కృష్ణని పిలుస్తుంది రేవతి. బ్రేక్ ఫాస్ట్  చేసి వెళ్ళమని అంటుంది. దానికి కృష్ణ లేట్ అవుతుంది అత్తయ్య అని చెప్తుంది. ఈ ఇంట్లో నీకు అమ్మ అయినా నాన్న అయినా ఫ్రెండ్ అయిన నేనే.. నీ కష్టాలు అన్ని నాకు చెప్పుకో అని కృష్ణతో రేవతి అంటుంది. కృష్ణకి ప్రేమగా బ్రేక్ ఫాస్ట్ తినిపిస్తుంది రేవతి. ఆ తర్వాత సరే అత్తయ్య అని చెప్పేసి కాలేజీకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.