ENGLISH | TELUGU  
Home  » TV News

మోకాళ్ళ మీద కూర్చొని కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి!

on May 20, 2023


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -161లో.. కృష్ణకి ప్రపోజ్ చెయ్యమని మధు అంటాడు. మీ స్వీట్ కపుల్ ని వీడియో తీసి పెడితే బోలెడు వ్యూస్ వస్తాయి. మురారి నువ్వు ప్రపోజ్ చెయ్ అనగానే రోజ్ ఫ్లవర్ తో మోకాళ్ళ పై కూర్చొని కృష్ణకి ప్రపోజ్ చేస్తాడు మురారి. మురారి ఇన్ని రోజులు కృష్ణపై దాచుకున్న ప్రేమని మొత్తం చెప్తాడు. ఐ లవ్ యూ కృష్ణ అని మురారి అనగానే.. లవ్ యూ టూ అని కృష్ణ చెప్తుంది. అదంతా చూస్తున్న ముకుంద..  మురారి అలా ప్రపోజ్ చెయ్యడం చూడలేక బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మధు బాగా ప్రపోజ్ చేసావని చెప్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు మధు. 

మరొకవైపు ఇంట్లో భవాని లేకపోవడంతో ఈశ్వర్, ప్రసాద్ లు డ్రింక్ చెయ్యడానికి.. కిచెన్ లో దాచుకున్న మందు బాటిల్ ని ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకెళ్తారు. అది చూసి రేవతి, సుమలత, అలేఖ్యలు నవ్వుకుంటారు. మరొకవైపు మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. నేను పెట్టిన ఎంగేజ్ మెంట్ రింగ్ ఎందుకు తీసేసావని అడుగుతుంది. నీకు నాకు ఎంగేజ్ మెంట్ ఏంటి నాన్ సెన్స్ అని మురారి అంటాడు. కృష్ణ వెళ్ళిపోయాక నన్నే కదా నువ్వు పెళ్లి చేసుకునేదని ముకుంద అంటుంది. కృష్ణ ఒకవేళ వెళ్ళిపోతే ఖాళీగానైనా ఉంటాను తప్ప.. నిన్ను పెళ్లి చేసుకోనని మురారి అనగానే.. అంటే నేను బరితెగించిన దానిలాగా కన్పిస్తున్నానా అని ముకుంద అంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తానని ముకుంద అంటుంది. నువ్వు ఎంత దూరం వస్తే.. నేను అంత కంటే ఎక్కువ దూరం వెళ్తానని మురారి అంటాడు. ఇద్దరు ఒకరినొకరు అనుకొని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు.. మరొకవైపు ముకుంద, మురారి లు మాట్లాడుకున్నదంతా మధు విని రేవతికి చెప్తాడు. మధు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా చూడాలని రేవతి తనలో తాను అనుకొని.. మధు చెంపపై ఒక్కటేసి వాళ్ళు కాజువల్ గా మాట్లాడుకుంటే నువ్వు అలా అంటావా అని రేవతి కోప్పడుతుంది.

మరొకవైపు ముకుంద మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు మురారి.. అప్పుడే కృష్ణ వెనకాల నుండి వచ్చి కళ్ళు మూసుకోండి ఏసీపీ సర్.. మీకు ఒకటి చూపిస్తానంటూ తనని తీసుకెళ్తుంది. మురారి కళ్ళు తెరిచి చూసేసరికి కృష్ణ ఫొటోస్ అన్ని ఒక గోడకు పెడుతుంది. అవి చూసి మురారి సంతోషపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.