Brahmamudi : మినిస్టర్ దగ్గరి పాపను ఎత్తుకున్న కావ్య.. పుట్టుమచ్చ చూసేసిందిగా!
on Jan 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -940 లో..... కావ్య పాపని స్వప్న వాళ్ళకి ఇచ్చి తన బిడ్డని కనిపెట్టడానికి వెళ్తుంది. కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ కి కావ్య వచ్చిన విషయం చెప్తుంది నర్స్. దాంతో డాక్టర్ వద్దని అంటుంది. అయిన కావ్య వినకుండా లోపలికి వస్తుంది. డాక్టర్ ప్లీజ్ నా బాధని అర్థం చేసుకోండి.. ఎందుకు ఇలా అంటున్నానో ఆలోచించండి. ఒక తల్లిగా నా తల్లి మనసు అర్ధం చేసుకోండి అని కావ్య ఎమోషనల్ అవుతుంది. దాంతో డాక్టర్ కరిగిపోయి. ఏం చెయ్యాలో చెప్పమని అంటుంది.
ఈ హాస్పిటల్ లో నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళ లిస్ట్ కావాలని అడుగుతుంది. ఎందుకని డాక్టర్ అడుగగా ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుస్తుందని కావ్య అనగానే డాక్టర్ సరే అంటుంది. లిస్ట్ తెప్పించాక పిలుస్తానని డాక్టర్ చెప్తుంది. మరొకవైపు ఇంట్లో పాప ఏడుస్తుంది. స్వప్న ఎంత ఊకోబెట్టిన ఊరుకోదు.. కావ్య ఎక్కడ అని అపర్ణ, ఇందిరాదేవి అడుగుతారు. తన పాపని వెతకడానికి వెళ్ళింది అని స్వప్న చెప్పగానే అందరు షాక్ అవుతారు. కావ్య చేసే పనికి అందరికి కోపం వస్తుంది. మరొకవైపు మినిస్టర్ తన భార్య తులసితో కలిసి పాపకి శాంతి పూజ చెయ్యడానికి గుడికి వస్తారు. అక్కడ వాళ్ళని రుద్రాణి చూస్తుంది. మినిస్టర్ ని పిలిచి మాట్లాడుతుంది. మీరు ఏంటి ఇక్కడ అని రుద్రాణి అడుగుతుంది. పాపకి శాంతి పూజ చెయ్యడానికి వచ్చామని మినిస్టర్ చెప్తాడు.
ఆ తర్వాత కావ్య హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తూ.. గుడి దగ్గర ఆగుతుంది. గుడి లోపలికి వెళ్లి దేవుడికి మొక్కుకుంటుంది. అక్కడే పక్కన పూజ జరుగుతున్న దగ్గర పాప ఏడవడం కావ్య చూసి తన దగ్గరికి వెళ్తుంది. తరువాయి భాగంలో కావ్య తన బిడ్డని ఎత్తుకుంటుంది. మినిస్టర్ కోపంగా పాపని లాక్కొని వెళ్తుంటే.. పాప చేతికి ఉన్న పుట్టుమచ్చని చూస్తుంది కావ్య. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



