మీలో ఎప్పుడూ ఫైర్ రగలాలి అంటూ కుందేలుతో ముచ్చట్లాడుతున్న కౌశల్
on May 6, 2023

కౌశల్ మందా బిగ్ బాస్ సెకండ్ సీజన్ ను ఒక ఊపు ఊపేసిన స్టార్. విశేషమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుని ఆ సీజన్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక అతని రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ కనిపించలేదు. అందుకే సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తన పిల్లల్ని స్కూల్ కి దింపుతూ, వాళ్ళను తీసుకొస్తూ, రెస్టారెంట్స్ కి వెళ్లి వెరైటీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా బీబీ జోడిలో కనిపించాడు. ఇలా కౌశల్ తన స్టయిల్లో తానూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపిస్తున్నాడు. ఇప్పుడు తాను పెంచుకునే బన్నీని చేతుల్లోకి తీసుకుని వాటికి ఫ్రూప్ట్స్ తినిపిస్తూ ఆ కుందేలుని బాడీ మీదకు ఎక్కించుకుని ఎంజాయ్ చేసాడు.
అలాగే న్యూస్ పేపర్ లో న్యూస్ చదువుతూ అది మాడి మసైపోతున్న ఒక వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మీ జీవితాన్ని ఎప్పుడూ మండిస్తూ ఉండండి" అని కాప్షన్ పెట్టాడు.ఇలా రకరకాల ఇన్స్పిరేషనల్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఫాన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. కౌశల్ బుల్లితెర మీదే కాదు బిగ్ స్క్రీన్ మీద కూడా కనిపించాడు. 1999లో మహేష్ బాబు "రాజకుమారుడు" మూవీలో సహాయ పాత్రలో నటించాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ "మిస్టర్ పర్ఫెక్ట్"లో కూడా ఒక పాత్రను పోషించాడు. ఇక కౌశల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య తేజస్విని మాదివాడ మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. దాంతో తేజు అసలు ఇండియాలోనే లేకుండా ఫారెన్ వెళ్ళిపోయింది. బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన మీడియాకి దూరమైపోయింది. బీబీ జోడిలో కూడా తోటి కంటెస్టెంట్స్ తో, జడ్జెస్ తో కూడా గొడవలయ్యాయి. కౌశల్ ఎక్కడుంటే అక్కడ గొడవలే అంటూ నెటిజన్స్ కూడా అప్పట్లో కామెంట్స్ పెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



