
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -411 లో..... వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. దాంతో వేదవతి కోపంగా లోపలకు వెళ్తుంది. అసలు ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందనుకోలేదు కానీ ఆ నర్మదని ముందులాగా కోడలు గా చూసుకోలేరని భాగ్యం, శ్రీవల్లి అనుకుంటారు. మళ్ళీ వేదవతి దగ్గరికి నర్మద వెళ్లి నాతో మాట్లాడండి అత్తయ్య అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వేదవతి కోపంగా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. దాంతో నర్మద ఏడుస్తుంది. భాగ్యం వాళ్ళు అదంతా చూసి నవ్వుకుంటారు. అప్పుడే నర్మద వచ్చి ఏంటి ఇంట్లో నుండి వెళ్ళిపోయాను హ్యాపీగా ఫీల్ అయి మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు బాధపడుతున్నారా అని భాగ్యం వాళ్ళతో నర్మద అంటుంది.
అలా ఏం లేదు చెల్లి అని శ్రీవల్లి అంటుంది. సాగర్ జాబ్ గురించి మావయ్య గారికి తెలియడంలో మీ పాత్ర ఉందని తెలియాలి అప్పుడు చెప్తాను. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు.. వెళ్లిపోండి అని భాగ్యానికి నర్మద వార్నింగ్ ఇస్తుంది. మాకేం తెలియదు అమ్మ అందరితో పాటు మేం జాబ్ విషయం షాక్ అయ్యాము.. మేం ఉండడం నీకు ఇష్టం లేదు కదా వెళ్ళిపోతామని భాగ్యం అంటుంది. మరొకవైపు ప్రేమ పడుకుంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. తన పక్కన కూర్చొని ఏంటే ఇంత అందంగా ఉన్నావ్ దిష్టి తగులుతుందని తన బుగ్గన నల్ల చుక్క పెడతాడు. ఆ తర్వాత తనకీ మీసాలు గీస్తాడు. ప్రేమ నిద్ర లేస్తుంది. తనకి అద్దంలో ధీరజ్ చూపించగానే ఒరేయ్ ఇలా చేసావ్ ఏంట్రా అని తనని కొట్టడానికి వెంటపడుతుంది. తిరుపతి దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ప్రేమ కూడా వెళ్తుంది. ఏంట్రా మీ రొమాన్స్.. ఏదైనా ఉంటే గదిలోకి వెళ్లి చూసుకోండి అని తిరుపతి అంటాడు. ధీరజ్ వెంటపడుతూ గదిలోకి వెళ్తుంది ప్రేమ. ఇక ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. చెయ్ వదిలి పెట్టి త్వరగా రెడీ అవు.. డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకొని రావాలని ధీరజ్ అంటాడు. డబ్బు ఎక్కడిది అని ప్రేమ అడుగుతుంది. లోన్ అని ధీరజ్ చెప్పగానే అవసరమా అని ప్రేమ అంటుంది. నువ్వు ముందు వెళ్లి రెడీ అవ్వు అని ధీరజ్ అంటాడు. మరొకవైపు నర్మద గదిలోకి వెళ్లి బాధపడుతుంది. నీ వల్లే ఇదంతా అని సాగర్ పై కోప్పడుతుంది.
ఆ తర్వాత భాగ్యం, ఆనందరావుని శ్రీవల్లి ఉండమని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే రామరాజు వస్తాడు. మీరు ఎందుకు వెళ్తున్నారని అడుగుతాడు. అమ్మాయిని ఇచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదని భాగ్యం అంటుంది. ఎవరైనా ఏమైనా అన్నారా అని రామరాజు అడుగుతాడు. ఎవరు ఏం అనలేదని భాగ్యం చెప్తుంది. భాగ్యం వాళ్ళు వెళ్ళిపోతారు. చందు మిల్ కి వెళ్తుంటే ఒరేయ్ జుట్టూ సరిచేసుకోమని చందు జుట్టు రామరాజు సరిచేస్తాడు. అది సాగర్ చూసి ఫీల్ అవుతాడు. నువ్వు ఏం మిస్ అయ్యావో అర్థం అవుతుందా అని సాగర్ తో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







