.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 752 లో.. మొత్తానికి దీప, జ్యోత్స్నల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఇద్దరూ ఒక్కటయ్యారు. జ్యోత్స్న సూరజ్‌ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో, ఆమె ప్రేమను సూరజ్‌కి అర్థమయ్యేలా చేయాలని దీప, కార్తీక్‌లు ప్రయత్నిస్తారు. దీప సలహాతో జ్యోత్స్న సూరజ్‌ను పెంచిన పెద్దాయనను కలుస్తుంది. సూరజ్ నాలుగేళ్ల వయసు నుంచి తన దగ్గరే పెరిగాడని, అతను అనాథ అని, చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోడని పెద్దాయన చెప్తాడు. జ్యోత్స్న కొంత డబ్బు ఇచ్చి.. అది సూరజ్ ఇచ్చినట్టే భావించమంటుంది. ఆమెను చూస్తాడు పెద్దాయన. నువ్వు సూరజ్‌కి కేవలం స్నేహితురాలివి మాత్రమే కాదనిపిస్తోంది.. భగవంతుడు వేసిన బంధంలా కనిపిస్తున్నావని ఆ పెద్దాయన అంటాడు. తర్వాత సూరజ్‌కి ఫోన్ చేసి జ్యోత్స్న వచ్చిన విషయం చెప్తాడు.
జ్యోత్స్న చేసిన పనికి సూరజ్ ఆమెకు థాంక్స్ చెప్తాడు. పెద్దాయన దగ్గరకు ఎందుకు వెళ్లావని సూరజ్ అడుగగా.. నా ఇష్టం.. వెళ్లాను. కావాల్సిన వాళ్ల గురించి తెలుసుకోవడంలో తప్పేం ఉందని అంటుంది. సూరజ్ మాత్రం ఆమె చేసిన మంచిని మెచ్చుకుని థాంక్స్ అంటూ చేయి అందిస్తాడు. ఆ క్షణంలో జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. సూరజ్ వెళ్లిపోయిన తర్వాత కార్తీక్, దీపలు ఆమెకు మరో విషయం చెప్తారు. మరుసటి రోజు సూరజ్ పుట్టినరోజు కావడంతో, అదే అవకాశంగా తీసుకుని అందరి ముందు సూరజ్‌కి తన ప్రేమను చెప్పాలని చెప్తారు. భయపడకు.. నీ మనసులో మాట చెప్పు. మేమంతా నీతోనే ఉన్నామని కార్తీక్ చెప్తాడు. దీంతో జ్యోత్స్న రాత్రంతా సూరజ్ తన ప్రేమను అంగీకరిస్తాడా లేదా అని ఆలోచిస్తుంటుంది. చివరికి ధైర్యం చేసి మరుసటి రోజు చెప్పాలని నిర్ణయించుకుంటుంది.
తెల్లవారగానే పసుపు చీరలో సూరజ్ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న.. ఇంట్లో పార్టీ ఉంది.. నువ్వు రావాలని చెప్తుంది. అయితే సూరజ్ మాత్రం ఆమె ఏదో చెప్పడానికి వచ్చిందని గుర్తిస్తాడు. చివరికి జ్యోత్స్న తన భయాన్ని, ఇగోను పక్కన పెట్టి.. నువ్వంటే నాకు ఇష్టం.. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావ్. ఈ మాట నువ్వు నమ్ముతావా అంటూ చెప్తుంటుంది. కానీ అదే సమయంలో సూరజ్ కి ఫోన్ రావడంతో అతను బయటకు వెళ్లిపోతాడు. తిరిగి వచ్చి.. ఏదో చెప్పాలన్నావ్.. ఏంటని అడగడంతో.. తను చెప్పింది అతను వినలేదని జ్యోత్స్నకు అర్థమవుతుంది. దాంతో బాధ, కోపంతో .. సరే.. ఆ కుర్రాడితో మాట్లాడుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న. సూరజ్ మాత్రం ఆమె ఎందుకు అలా వెళ్లిపోయిందో అర్థం కాక ఏదో చెప్పి వెళ్లొచ్చు కదా.. ఇగో అడ్డొస్తుందా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(1).webp)
(2).webp)
