(1).webp)
బిగ్ బాస్ సీజన్ 10 కోసం రంగం సిద్దమైంది. హౌస్ లోకి పంపడానికి అగ్నిపరీక్ష సీజన్-2 కూడా మొదలైంది. ఇందులో భాగంగా కొంతమందిని జడ్జెస్ హౌస్ లోకి పంపిస్తారు. ఇక దీనికోసం అగస్ట్ పదిహేను నుండి జియో హాట్ స్టార్ లో ఎపిసోడ్లు మొదలయ్యాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
నిన్నటి ఎపిసోడ్ లో రాజకుమారి మూడు గ్రీన్ లతో టాప్-15 కి చేరుకుంది. ఆ తర్వాత లయ వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయి లయ. ఆమె వయసు 24 మాత్రమే. చూస్తే చాలా చిన్న పిల్లలా, క్యూట్ గా ఉంటుంది. కానీ స్టేజ్ ఎక్కగానే మాటలతో, స్టైల్ తో అందరి దృష్టిని తనే లాక్కుంది. నా బాడీ చూసి చిన్న పిల్ల అనుకుంటారు.. కానీ గెలికితే గువ్వ గుయ్మంటదనే డైలాగ్ తోనే జడ్జ్ లకి తన పవర్ ఏంటో చూపించింది. ఆమెకి నలుగురిని నామినేట్ చేయమని టాస్క్ ఇచ్చారు. అందులో బిందు మాధవి పేరు తప్పుగా చెప్పింది. సారీ మేడం, నేను ఓటీటీ షో చూడలేదు, మీ గురించి నాకు అంతగా తెలీదుని సూటిగా చెప్పేసింది. ఆ తర్వాత బరువులు ఎత్తే ఫిజికల్ టాస్క్ కూడా చేసింది. చిన్నగా ఉన్నా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసింది.
డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. నవదీప్ కూడా నెక్ట్స్ రౌండ్ లో ఏం జరుగుతుందో చూద్దామని గ్రీన్ ఇచ్చాడు. బిందు మాధవి మాత్రం.. నువ్వు గలగల మాట్లాడుతున్నావ్.. ఎంటర్టైనింగ్ గా ఉంటావ్. కానీ హౌస్ లో అందరినీ హ్యాండిల్ చేయగలవా అనేదే డౌట్ అని చెప్పేసి రెడ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టింది. అంటే టాలెంట్ ఉంది, ఎనర్జీ ఉంది. కానీ గేమ్ ఆడగలదా లేదా అనేది ఇంకా టెస్ట్ చేయాలని చెప్పింది. అందుకే లయ ఇప్పుడు హోల్డ్ లో ఉంది.




(1).webp)
.webp)
