Home

»

Tv News

Illu illalu pillalu: భద్రావతి కుట్రతో ధీరజ్, ప్రేమల మధ్య పెరిగిన మనస్పర్థలు!

Aug 19, 2026 9:26AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు  Illu illalu pillalu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 553లో.. ధీరజ్ ప్రేమను తిరిగి తనకు దగ్గర చేసుకోవాలని ఆమె గదిలోకి రహస్యంగా వెళ్లి.. గోరింటాకుతో ఆమె చేతిపై ధీమా అని తన పేరు రాస్తాడు. కానీ ధీరజ్ వెళ్లిపోయిన తర్వాత భద్రావతి ఆ పేరును.. కళ్యాణ్ గా మార్చేస్తుంది. ఉదయం ప్రేమ చేతిపై కళ్యాణ్ పేరు కనిపించడంతో అందరు షాక్ అవుతారు. భద్రవతి కావాలనే ప్రేమను రెచ్చగొడుతూ.. గోరింటాకు పెట్టింది ధీరజే కదా.. మరి కళ్యాణ్ పేరు కూడా అతడే రాసి ఉంటాడు. నిన్ను బాధపెట్టడమే అతడి పని అంటుంది. దాంతో కోపంతో ప్రేమ ధీరజ్ ఇంటికి వెళ్లి.. ధీరజ్.. బయటకు రా.. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అంటూ నిలదీస్తుంది. ధీరజ్ మాత్రం ఆమెను చూసి నవ్వుతూ.. మీ భద్రావతి అత్త పూనిందా ఏంటి? ఆమె బుద్ధులు బాగానే వచ్చాయే నీకు అంటూ ఆటపట్టిస్తాడు. 

 

ప్రేమ తన చేతిని చూపించి.. ఈ గోరింటాకు పెట్టింది నువ్వేనా? కళ్యాణ్ పేరు రాసింది కూడా నువ్వేనా? అని అడుగుతుంది. ధీరజ్ మొదట సరదాగా మాట్లాడుతూ, తనే గోరింటాకు పెట్టానని ఒప్పుకుంటాడు కానీ కళ్యాణ్ పేరు మాత్రం తను రాయలేదని స్పష్టంగా చెప్తాడు. నా మీద ఒట్టు.. ఆ పేరు నేను రాయలేదని అంటాడు. వేదవతి, నర్మద కూడా ధీరజ్ మాటలను నమ్ముతారు. అయితే ప్రేమ మాత్రం.. గోరింటాకు పెట్టింది నువ్వే కదా.. మరి పేరు ఇంకెవరు రాస్తారు? కళ్యాణ్ పేరుతో నన్ను మళ్లీ బాధపెట్టాలనుకుంటున్నావంటూ  వాదిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుంది. ధీరజ్ కూడా కోపంతో.. నిన్ను సంతోషంగా ఉంచడానికే నేను బతుకుతున్నాను. నిన్ను బాధపెట్టే పని ఎప్పటికీ చేయనని చెప్తాడు. కానీ ప్రేమ మాత్రం గతంలో కళ్యాణ్ విషయంలో ధీరజ్ తన మాట తప్పాడనే బాధతో అతడిని నమ్మలేకపోతుంది. 

 

చివరికి ప్రేమ తనను, తన కుటుంబాన్ని బాధపెట్టడమే ధీరజ్ ఉద్దేశమని అంటుంది. ధీరజ్ మాత్రం తను ఇన్ని నెలలు ప్రేమను ప్రేమగా చూసుకున్నా, ఆమె తన ప్రేమను అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు. కోపం తారాస్థాయికి చేరడంతో.. నువ్వు నన్ను బాధపెట్టినవాడిలానే చూస్తావు.. నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోవు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా.. నువ్వు నాకు వద్దు అంటూ ధీరజ్ కోపంగా చెప్తాడు. దాంతో నర్మద, వేదవతి షాక్ అవుతారు. భద్రవతి మాత్రం లోలోపల సంతోషిస్తుంది. ఈరోజు నుంచి నీ మొహం కూడా చూడను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రేమ కూడా ధీరజ్ మాటలకు బాధపడి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com