.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -833 లో... జ్యోత్స్న మోసం చేసిందని సూరజ్ బాధపడుతుంటాడు. ఇంతలో దక్షిణామూర్తి వచ్చి ఏమైందని అడుగుతాడు. వాడు నిజాలు తెలుసుకున్నాడు, వాడి మనసులో బాధ పోనివ్వండి మామయ్య గారు అని మాలిని అంటుంది. ఇంతలో కార్తీక్, దీప, జ్యోత్స్న, పారిజాతాన్ని తీసుకొని వస్తారు. ఆ నిజం మేం నిరూపిస్తామని కార్తీక్ అంటాడు. ఏంటా నిజమని దక్షిణామూర్తి అడిగితే ఓ అందమైన అబద్ధాన్ని నిజంగా మార్చారని దీప అంటుంది. ఎవరు అది తాత అడిగితే ఇంకెవరు పిన్ని అని కార్తీక్ అంటాడు. ఏమైనా ఉంటే ఆఫీస్ లో చూసుకుందాం మీరు వెళ్లండి అని సూరజ్ అంటే మేం ఆఫీస్ పని మీద రాలేదు, నా చిన్న మరదలి క్యారెక్టర్ మీద మచ్చ పడింది అందుకే వచ్చామని కార్తీక్ అంటాడు. అది నిజమే కదా, జ్యోత్స్న తప్పు చేయకపోతే అకౌంట్ లోకి రెండు కోట్లు ఎలా వచ్చాయని సూరజ్ అడిగితే మీ అమ్మ వేయిస్తే వచ్చాయని కార్తీక్ అంటాడు.
మీ అందరూ బాగుండాలని జ్యోత్స్న రెండు కోట్లు అడిగిందని మాలిని అంటుంది. దీనికి ఏ పేరు పెట్టాలని కార్తీక్ అంటే సెటిల్మెంట్ అని మాలిని అంటుంది. నిన్ను మర్చిపోవడానికి మీ అమ్మ జ్యోత్స్నకి రెండు కోట్లు ఇచ్చింది, నువ్వు ఒప్పుకోవాల్సింది ఏంటంటే నువ్వు జ్యోత్స్నని ప్రేమిస్తున్నావని కార్తీక్ అంటాడు. నేను చెప్పానా అని సూరజ్ అంటే మీ అమ్మ చెప్పింది, నా కొడుకుని వదిలేయ్ అని నువ్వు మీ అమ్మ రెండు కోట్లు ఇచ్చింది అంటే నీ కొడుకు మనసులో జ్యోత్స్న ఉందని తెలిసే ఇచ్చావ్ కదా అని కార్తీక్ అంటాడు. నా కొడుకు మనసులో జ్యోత్స్న లేదని మాలిని అంటే మరి రెండు కోట్లు ఎందుకు ఇచ్చావని అడుగుతాడు.
కార్తీక్ తో దారిన పోయే దానమ్మా నీ కొడుకు ప్రేమించుకోవచ్చు, అది నీకు ప్రాబ్లం కాదు, నీ కొడుకు ఎవర్ని ప్రేమిస్తున్నాడనేదే పాయింట్, నీ కొడుకు మనసులో జ్యోత్స్న ఉంది కాబట్టి ప్రేమకి ఖరీదు కట్టావు, ఆ ప్రేమని చంపేయాలనుకున్నావు, అందుకు హాఫ్ బ్రెయిన్ ఉన్న మా పారుని పావుగా వాడుకున్నావని కార్తీక్ అంటాడు. తెలివిగా అమౌంట్ క్రెడిట్ అయిన మెసేజ్ ని ఆధారంగా చేసుకుని డబ్బులేసిన పారిజాతాన్ని సాక్ష్యం చేశావని, నీ కొడుకు మనసులో ప్రేమని రెండు కోట్లుగా అమ్మేశావేంటి పిన్ని అని కార్తీక్ ఫైర్ అవుతాడు.
అప్పుడు పారిజాతం వచ్చి.. మాలిని నన్ను పిలిపించలేదు, నేనే మాలినిని కలిశాను, జ్యోత్స్న పంపించింది, జ్యోత్స్న నన్ను డబ్బు కోసమే పంపించింది, సూరజ్ ని చేసుకుంటే ఆస్తి మొత్తం దక్కుతుందని వాళ్ళ నాన్న వీలునామా రాయించాడు, పెళ్లి చేసుకోకపోతే ఆస్తి పోతుందని పెళ్లికి ఒప్పుకుంది, నేనే ఒప్పించానని, సూరజ్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ నాటకం ఆడిందని, ఆస్తి కోసమే సూరజ్ ని చేసుకుంటానని చెప్పిందని జ్యోత్స్న మీద లేనిపోనివి చెప్పేస్తుంది.జ్యోత్స్న నిజమేనా అని సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్న ఏం మాట్లాడలేక కన్నీరు పెట్టుకుంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ జ్యోత్స్న డబ్బు మనిషిరా, డబ్బు కోసం అమ్ముడు పోతుందని మాలిని అంటుంది. కార్తీక్ మాలినితో నీ తెలివికి తట్టుకోలేకపోతున్నానని ఆవేశంగా అంటాడు. జ్యోత్స్న ఏడుస్తూ సూరజ్ ని చూసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
