.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-831 లో.. జ్యోత్స్న, సూరజ్ కారు ఎక్కి వెళ్లడం పారిజాతాం చూసి శివన్నారాయణకు చెప్పాలని వెళ్లబోతే మాలిని మనిషి పారిజాతాన్ని తీసుకెళ్లిపోతాడు. సూరజ్ జ్యోత్స్నని ఓ చోటకి తీసుకెళ్లి మన జీవితాలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటున్నానని అంటాడు. మన జీవితాలకా అని జ్యోత్స్న అంటే అవునని, ఇంతకంటే వింత మన జీవితాల్లో జరగబోతుందని, మా అమ్మకి చెప్పి అది చేస్తానని అంటాడు.
మీ అమ్మ పర్మిషన్ తీసుకుంటావా అని జ్యోత్స్న అంటే పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఇస్తా.. మా అమ్మ విషయంలో మాత్రమే ప్రతీది చెప్తా.. నేను జవాబు చెప్పుకోవాల్సింది కేవలం మా అమ్మే, నా కోసం బతుకుతున్న ఒకే ఒక్క మనిషి మా అమ్మ అని సూరజ్ అనగానే జ్యోత్స్న మళ్లీ చెప్పమని అడిగి ఇంకెవరూ లేరా అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది. దానికి సూరజ్ ఈ ప్రశ్నకి సమాధానమే ఇవ్వాలి అనుకుంటున్నానని అంటాడు. మన దగ్గర జాగ్రత్తగా దాచుకున్న మన జ్ఞాపకాలే ఈ కథకి ముగింపు అని తాళిని గుర్తుచేసుకుని అంటాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు ఓకే చెప్పాలి.. మా అమ్మకి చెప్పిన తర్వాత మొదట నీకే చెప్తానని అంటాడు.
మరోవైపు పారిజాతాన్ని రౌడీ మాలిని ఇంటికి తీసుకొస్తారు. మాలినిని చూసి పారిజాతం షాక్ అయి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావని అడుగుతుంది. జ్యోత్స్న నీ మనవరాలేనా, నీ మీద ప్రేమ లేదు దానికి అని మాలిని అంటుంది. దానికి పారు.. నా మీద ప్రేమ ఉంది కానీ నీ కొడుకు వచ్చి మా జ్యోత్స్నని కారు ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు.. జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడు.. అది అందరికీ తెలుసు, కానీ నీ కొడుకు మనసులో కూడా జ్యోత్స్న ఉందని అంటుంది. నా కొడుకు నేను గీసిన గీత దాటడు.. నేను చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టమంటే కడతాడు.. కానీ నీ మనవరాలి పరిస్థితి ఏంటి, సూరజ్ జ్యోత్స్నని మర్చిపోతే జ్యోత్స్న జీవితం బాగుపడుతుంది.. లేదంటే ఎడారే అని మాలిని చెప్తుంది. నేను చెప్పినట్లు చేస్తే ఈ డబ్బు నీకే అని డబ్బు చూపిస్తుంది.
జ్యోత్స్న దగ్గరకు పారిజాతం వెళ్లి.. నువ్వు నీలా ఉండు, సూరజ్ ని మర్చిపో, అందర్నీ వదిలేయ్ అని అంటుంది. నువ్వు సూరజ్ ని వదిలేయకపోతే చాలా నష్టపోతావ్.. మాలిని మంచిది కాదే అని చెప్తుంటే జ్యోత్స్న పారుని పంపేస్తుంది. సూరజ్ ఆఫీస్ లో తాళి పట్టుకుని జ్యోత్స్నకి ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మాలిని వచ్చి నువ్వు జ్యోత్స్నని ప్రేమిస్తున్నావా, తనతో బతకాలి అనుకుంటున్నావా.. నీ ప్రవర్తన చూసి డౌట్ వచ్చింది.. ఒకవేళ అదే చేయాలనుకుంటే నీ ప్రేమకి ఈ అమ్మ ఎప్పటికీ అడ్డురాదు.. జ్యోత్స్న మీ నాన్న చావుకి కారణమైన సుమిత్ర కూతురు అయినా సరే మర్చిపోతా, నాకు నీ కంటే ఏదీ ఎక్కువ కాదు, నీ కోసం అన్నీ మర్చిపోతాను, కానీ జ్యోత్స్న ఎందుకు నాన్న ఇలా చేసిందంటూ నిజం చెప్పబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
