.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-1190 లో.. ఐశ్వర్య ఎక్స్ పోలో స్వరాజ్ కంపెనీ రెప్యుటేషన్ మొత్తం తీసేస్తుందని, తన బిహేవియర్ తో తమకు కూడా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందని, అలాంటి ఐశ్వర్యకు సిస్టర్ కంపెనీ అంటూ సంతకం చేసి ఎంట్రీ పాస్ ఇప్పించడం కరెక్ట్ కాదని ఇందుని రాజు తిడుతుంటాడు. ఇందు మాత్రం ఎవరూ పుట్టగానే ప్రొఫెషనల్స్ కారని, అనుభవాలే మనిషిని బిజినెస్ పర్సన్ గా మారుస్తాయని, ఐశ్వర్యకు ఒక అవకాశం మాత్రమే ఇచ్చామని, చూద్దాం ఎలా ఉపయోగించుకుంటుందో అంటూ సపోర్ట్ చేస్తుంది.
ఎక్స్ పోకి కస్టమర్లు రావడం మొదలవుతుంది. ఇందు స్టాల్ దగ్గరకు గుంపులుగుంపులుగా కస్టమర్లు వెళ్తుంటారు. ఐశ్వర్య స్టాల్ దగ్గరకు అరకొరగా వచ్చినా డిజైన్స్ నచ్చడం లేదని పక్క స్టాల్ కి వెళ్తుంటారు. ఒక కస్టమర్ డిజైన్స్ మరీ ఓల్డ్ గా ఉన్నాయంటే, ఐశ్వర్య కోపంగా సంతలో కూరగాయలు కొనడం కూడా చేతకాని నువ్వు మా డిజైన్స్ గురించి మాట్లాడతావా అని తిడుతుంది. ఆ కస్టమర్ ఐశ్వర్యని తిట్టి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత ఐశ్వర్య ఒక ప్లాన్ చేస్తుంది. పార్వతీశంని పిలిచి ఇందు స్టాల్ దగ్గరకు వెళ్లి ఐటమ్స్ బ్రేక్ చేయమని చెప్తుంది. పార్వతీశం కస్టమర్ లాగే వెళ్లి ఇందు స్టాల్ లో ఉన్న నెక్లెస్ లోని స్టోన్స్ తీసేసి, ఎవరూ చూడకుండా అక్కడే పెట్టేసి వెళ్లిపోతాడు. అంతా గమనించిన ఐశ్వర్య వెరీగుడ్ పారు అంటుంది. పార్వతీశం ఇంక్రిమెంట్ అడిగితే 1116 రూపాయలు ఇస్తానని చెప్పడంతో పారు షాక్ అవుతాడు.
ఇందు స్టాల్ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఆ బ్రేక్ చేసిన నెక్లెస్ చూసి స్టోన్స్ మిస్ అయ్యాయి, మోసం చేస్తున్నారా అంటూ అరుస్తాడు. ఐశ్వర్య నవ్వుతూ నా ఐడియా వర్కవుట్ అవుతుంది. ఈ దెబ్బతో ఇందు స్టాల్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు అంటుంది. కానీ ఇందు తెలివిగా ఇది స్టోన్ మిస్ చేయడం కాదు సర్, ఇదే లేటెస్ట్ ట్రెండ్ స్టోన్ మిస్సింగ్ నెక్లెస్ అంటూ కస్టమర్ ని నమ్మిస్తుంది. కస్టమర్ పది నెక్లెస్ లు కావాలని ఆర్డర్ ఇస్తాడు. దీంతో ఐశ్వర్య షాక్ అవుతుంది.
ఆ తర్వాత ఇందు ఆ కస్టమర్ దగ్గరకు వెళ్లి అసలు నిజం చెప్తుంది. స్టోన్ ఎలా మిస్ అయిందో తెలియదని, కంపెనీ పరువు పోతుందని అలా చెప్పానని, ఆర్డర్ వెనక్కి తీసుకోమని చెక్ ఇవ్వబోతుంది. కస్టమర్ నవ్వుతూ మీ నిజాయితీ నచ్చిందని, స్టోన్ తో ఉన్న నెక్లెస్ ఇవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇందుకి స్టాల్ ముందు ఆ మిస్ అయిన స్టోన్ కనిపిస్తుంది.. రాజుని పిలిచి ఇదే కదా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
