.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -825 లో.. జ్యోత్స్నకి సూరజ్ కాల్ చేసి.. మా అమ్మకి ఫోన్ చేసి అన్ని మాటలు అంటావా అని నిలదీస్తాడు. మా అమ్మ స్థానంలో ఎవరున్నా అదే చేస్తారని, రోడ్డు మీద కూతురు వేరే వాళ్లతో ఐస్ క్రీం తింటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని జ్యోత్స్న అంటుంది. పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారని జ్యోత్స్న అనగానే సూరజ్ కంగారు పడతాడు. సంబంధాలు చూడమని చెప్పానని జ్యోత్స్న అంటే షాక్ అవుతాడు. తర్వాత అలా అంటావా.. అనుకున్నావా, నిన్ను ఎగరేసుకుపోయి తాళి కట్టించుకుంటానని మీ అమ్మ టెన్షన్ పడుతుందని, నువ్వు కలిసిన ప్రతిసారీ బాడీగార్డ్స్ ని ఫాలో అవ్వమని చెప్తుందని జ్యోత్స్న అంటుంది. మీ అమ్మ స్వార్థం నిన్ను కూడా ప్రశాంతంగా బతకనివ్వదని జ్యోత్స్న అంటే, మా అమ్మ ఎంత మంచిదో నీకు తెలియదని సూరజ్ అంటాడు.
కార్తీక్ దగ్గరికి పారిజాతం వెళ్లి జ్యోత్స్నని పెళ్లి చేసుకోమని చెప్పరా అని అడుగుతుంది. జ్యోత్స్న జీవితం నాశనం అవ్వడానికి నువ్వు, నీ భార్యే కారణమని, సూరజ్ జ్యోత్స్నని ప్రేమించడానికి కారణం మీరే అని అంటుంది. ఆ రోజు హాస్పిటల్ లో పిల్లల్ని మార్చడమే ఇందుకు కారణమని, దీప స్థానంలో దీప, జ్యోత్స్న స్థానంలో జ్యోత్స్న ఉంటే ఈ బాధ ఉండేది కాదని అంటుంది. జ్యోత్స్న శివన్నారాయణ మనవరాలు కాకపోతే ఇదంతా అయ్యేది కాదని, ఆ రోజు నిజం చెప్పలేదని అంటే, మీరు ఎందుకు చెప్పలేదని పారిజాతం అంటుంది. ఇప్పుడు చెప్పినా ఫలితం లేదని, నువ్వు దశరథ్, సుమిత్రల కూతురు కాదని చెప్తే జ్యోత్స్న ఒప్పుకోదని, తనని మార్చాలని చూడకని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. నా మనవరాలిని నేనే పాత జ్యోత్స్నని చేస్తానని పారిజాతం అంటుంది.
అటు సూరజ్ దీప, జ్యోత్స్నలతో నేషనల్ రెస్టారెంట్స్ వాళ్లు డీల్ కోసం వస్తున్నారని, ఈ డీల్ ఓకే అయితే జ్యోత్స్న రెస్టారెంట్స్ నేషనల్ స్థాయికి వెళ్తాయని చెప్తాడు. చిన్న తప్పు కూడా జరగకూడదని, పూర్తి బాధ్యత జ్యోత్స్నదే అని చెప్తాడు.నేషనల్ ఇన్వెస్టర్లు రావడంతో జ్యోత్స్న, దీప వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. జ్యోత్స్న చాలా బ్యూటిఫుల్ గా ఉందని అనుకున్న ఇన్వెస్టర్, ఫైల్ నువ్వే చదివి పెట్టు అంటాడు. తర్వాత జ్యోత్స్న చేయి పట్టుకుని నువ్వు ఇంకా మంచి స్థాయిలో ఉండేదానివని, నీ ఛైర్మన్ కి ఛాన్స్ ఇస్తావా మాకు ఇవ్వవా అని అసభ్యంగా మాట్లాడతాడు. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, సంతకం పెడతానని తప్పుగా ప్రవర్తించడంతో జ్యోత్స్న కోపంగా చూసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
