.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 159 లో... నందు వర్క్ చేసుకుంటూ ఉంటే మురళీ షర్ట్ వేసుకుంటూ గుండీ ఊడిపోతుంది. బామ్మ వచ్చి నందుకి సూది దారం ఇచ్చి కుట్టమని అంటుంది. నేను కుట్టనని నందు అన్నా, బామ్మ ఫోర్స్ చేయడంతో షర్ట్ బటన్ కుడుతుంది. నందు బటన్ కుడుతూ ఉంటే మురళీ అదే పనిగా చూస్తూ ఉంటాడు. నువ్వు నా దగ్గరకు వస్తుంటే నా గుండె వేగం పెరిగిపోతుందని మురళీ అంటాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంతలో నందు చేతికి సూది గుచ్చడంతో మురళీ వేలిని నోట్లో పెట్టుకుంటాడు. హాస్పిటల్ కి వెళ్దాం బ్యాండేజ్ తెస్తానని మురళీ హడావుడి చేయడం చూసి నందు అలా ఉండిపోతుంది.
అటు జానుతో సంజయ్.. నువ్వు మహానటివి అని తెలుసు కానీ ఇంత దిగజారుతావనుకోలేదని, చెల్లికి చెల్లికి అంటూ ఆ సూర్యకి డబ్బులు ఇస్తూ వాడితో ఊరేగుతున్నావా అని నిలదీస్తాడు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసిపోయిందని సూరజ్ అనగానే.. సూర్యకి డబ్బులు ఇచ్చాను కానీ ఎందుకు ఇచ్చానో తెలుసా అని జాను అంటే, మాజీ లవర్ కదా వాడికి ఇవ్వవా అని సంజయ్ అంటాడు. వాడు వీడు అనొద్దని, నన్ను అడిగే అధికారం మీకు ఎక్కడిదని జాను అంటే, మనది అగ్రిమెంట్ పెళ్లి అయినంత మాత్రాన నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఎలా అని సంజయ్ అంటాడు. దీంతో నేను ఈ క్షణం నుంచి మీ భార్యని కాదని జాను అంటుంది. ఇంకొక్కసారి ఇలా చేస్తే మన పెళ్లి అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పేస్తానని జాను అంటే బెదిరిస్తున్నావా అని సంజయ్ అంటాడు.
వెంటనే జాను తన బట్టలు సర్దేస్తుంది. అగ్రిమెంట్ ఉంది తెలుసు కదా అలా ఎలా వెళ్తావని సంజయ్ అంటే, అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడతారా, అగ్రిమెంట్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారో కోర్టుకి వెళ్తారో మీ ఇష్టం నేను ఇక్కడ ఉండనని బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుంది. ఇంటి నుంచి వెళ్తుంటే బామ్మ ఆపుతుంది. ఈ టైంలో సూట్కేస్ సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావని అడగనని, గొడవ పడ్డారా అని బామ్మ అంటే, మీ మనవడి మాటలు చాలా తేడాగా ఉన్నాయని జాను అంటుంది. సంజయ్ కి అమ్మానాన్న లేరని, ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాడని, అమ్మ ప్రేమలో మోసపోయాడని, అమ్మాయి ప్రేమలోనూ మోసపోయాడని, ఇప్పుడు నువ్వు కూడా వాడిని మోసం చేసి వెళ్లిపోతావా అమ్మా అని బామ్మ అనడంతో జాను ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
