Karthika Deepam2 : దీప చేసిన వంటలన్నీ తిన్న సుమిత్ర.. పందెంలో గెలిచిందెవరంటే!
on Jun 20, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -388 లో.... సుమిత్రని అమ్మగారు అని శౌర్య పిలవడంతో సుమిత్రకి కోపం వస్తుంది. దీప దగ్గరికి వచ్చి ఎందుకు చిన్నపిల్లని పాడుచేస్తున్నావ్.. నీ మీద కోపం తన మీద కాదు.. అయినా నేను భోజనం చెయ్యలేదని దానికేల తెలుసని సుమిత్ర అడుగుతుంది. అంటే ఇంట్లో అనుకుంటుంటే విన్నదని దీప అంటుంది. అయితే ఇంట్లో కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావన్న మాట.. నీతో ఏ బంధం లేదు కానీ దానితో ఒక బంధం ఉందని దీపతో సుమిత్ర అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అదంతా వింటున్న జ్యోత్స్న నీకు తెలియక అన్నా కూడా అదే నిజమని అనుకుంటుంది. దీప దగ్గరికి కార్తీక్ వచ్చి.. నువ్వు కోరుకుంది కూడా ఇదేగా అత్తకి శౌర్య అంటే చాలా ష్టమని కార్తీక్ అంటాడు. మరొకవైపు మమ్మీకి ఆ శౌర్య అంటే ఎందుకు అంత ఇష్టం.. ఎలాగైనా దాన్ని అమ్మకి దూరం చెయ్యాలని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అప్పుడే కార్తీక్ దగ్గరికి శౌర్య వస్తుంది. నువ్వు ఇక ఇంటికి వెళ్ళు అని శౌర్యని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరకి జ్యోత్స్న వస్తుంది. మా మమ్మీ ని ఈ రోజు కూడా తినకుండా చేస్తారా ఏంటని జ్యోత్స్న అనగానే.. అలా అయితే నువ్వే తినేలా చెయ్యొచ్చు కదా.. నీ వల్ల కాదు నేనే తినేలా చేస్తానని జ్యోత్స్నతో కార్తీక్ పందెం కడుతాడు. ఒకవేళ నువ్వు ఓడిపోతే గుంజీలు తియ్యాలని కార్తీక్ అంటాడు. మరి నువ్వు ఓడిపోతే అని జ్యోత్స్న అనగానే నేను గుంజీలు తీస్తానని దీప అంటుంది.
ఆ తర్వాత అందరు భోజనానికి వస్తారు. జ్యోత్స్న మాత్రం సుమిత్రని తీసుకొని రెస్టారెంట్ కి బయల్దేర్తుంది. కార్తీక్ వద్దని ఆపుతాడు. ఇప్పుడు దీప వంటలు తింటే ఎక్కడ మీ మనసు మారుతుందోనని మీకు భయమని కార్తీక్ అనగానే నాకేం భయం లేదని దీప వండిన అన్ని రకాల వంటలు తింటుంది సుమిత్ర. ఇప్పుడు నీకు కోపం పోయిందా అని కార్తీక్ అనగానే.. ఎప్పటికి పోదని సుమిత్ర అంటుంది. దాంతో దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



