Karthika Deepam2 : శివన్నారాయణ నోటి వెంట ఆ మాట.. కార్తీక్, దీపల ప్లాన్ సక్సెస్!
on Jun 6, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -376 లో..... కార్తీక్ ప్లాన్ చేసి మరి గౌతమ్ పెళ్లి గురించి మాట్లాడడానికి రప్పిస్తాడు. గౌతమ్ శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏదైనా చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ దీప వాడిని చుస్తే వాడిని మళ్ళీ కొడుతుంది.. నువ్వు వెళ్లి దీపని కాఫీ తీసుకొని రమ్మని చెప్పమని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. అదే విషయం కార్తీక్ కి చెప్తుంది పారిజాతం. అంతమందిలో దీప ఒక నింద మోపింది.. అది అబద్ధం అయిన కానీ మా మనసుల్లో కొంచెం డౌట్ ఉందని పారిజాతం అంటుంది.
అంటే మీకు నాపై నమ్మకం లేదా అని గౌతమ్ అంటాడు. అప్పుడే దీప కాఫీ తీసుకొని వస్తుంది. దీప వస్తుంది ఏంటని గౌతమ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఆ దీప చేతిలో వీడు అయిపోయాడని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అప్పుడే దీప వచ్చి గౌతమ్ వంక కోపంగా చూస్తుంది. కాఫీ పక్కన పెట్టి.. ముందు మీకు కాఫీ కాదు సారీ చెప్పాలని సారీ చెప్తుంది దీప. అనవసరంగా ఎవరో చెప్పింది విని మిమ్మల్ని అలా కొట్టాను.. క్షమించండి అని దీప అనగానే అందరు షాక్ అవుతారు. నువ్వు అలా అందరి ముందు కొట్టి ఇప్పుడు ఇలా సారీ చెప్తే ఎలా అని కార్తీక్ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే.. ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్ మెంట్ చెయ్యండి అందరి ముందు సారీ చెప్తానని దీప అనగానే.. మా తాత అందుకు ఒప్పుకోడు అని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పేదేంటి నేను ఒప్పుకుంటున్నాను.. వాళ్ళకి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని శివన్నారాయణ చెప్తాడు.
ఆ తర్వాత ఏంటి గ్రానీ ఆ దీప, బావ కలిసి ఇలా దెబ్బకొట్టారు.. ఇప్పుడు ఏం చెయ్యాలని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేసి నువ్వే ఈ పెళ్లి ఆపాలని పారిజాతాన్ని జ్యోత్స్న రిక్వెస్ట్ చేయగా.. తను సరే అంటుంది. ఆ తర్వాత రాత్రి దీప కార్తీక్ ఇంటికి వెళ్తు.. వెళ్లొస్తానమ్మ అని సుమిత్రకి దీప చెప్పగానే నన్ను అలా పిలవొద్దని దీపపై కోప్పడుతుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
