Karthika Deepam2 : నువ్వే అసలైన వారసురాలివి.. దీపకి నిజం చెప్పిన కార్తీక్!
on May 27, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -367 లో..... జ్యోత్స్న తనకున్న శాడిజంతో కార్తీక్ ని బానిసలాగా చేసుకొని తనకి నచ్చిన పని చేయించుకుంటుంది. అవన్నీ వీడియో తీసి దీపకి పంపిస్తుంది జ్యోత్స్న. దీప ఆ వీడియోస్ చూసి బాధపడుతుంది. ఏంటి అవి అని కాంచన కూడా వాటిని చూసి ఏడుస్తుంది. కార్తీక్ షూస్ క్లీన్ చేస్తున్న వీడియో చూసి కాంచన చాలా బాధపడుతుంది.
అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఏం చూస్తున్నారని అడుగుతాడు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావ్.. ఎందుకు ఇదంతా చేస్తున్నావని కాంచన బాధపడుతుంది. వాళ్ళకి అసలు నిజం చెప్పలేక కార్తీక్ ఇబ్బంది పడతాడు.ఆ తర్వాత దీపకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. నేను అనుకున్నది సాధించానని గర్వం తో జ్యోత్స్న మాట్లాడుతుంది. బావని నా చుట్టూ తిప్పుకుంటున్నానని జ్యోత్స్న అంటుంటే దీపకి కోపం వస్తుంది.
మరుసటి రోజు కార్తీక్ ఇంటి నుండి బయటకు వెళ్తుంటే దీప అడ్డుపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు.. మీరు ఎక్కడికి వెళ్లొద్దని దీప అంటుంది. అసలు మీరు ఎందుకు ఆ పేపర్స్ పై సంతకం చేసారని దీప అంటుంది. నీ కోసం.. నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యడం కోసమని కార్తీక్ అంటాడు. నన్ను ఎందుకు దగ్గర చెయ్యడమని దీప అంటుంటే.. చెప్తానంటూ తనని కార్తీక్ పక్కకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే నువ్వు నా మరదలివి.. సుమిత్ర దశరత్ ల సొంత కూతురివి.. అసలైన వారసురాలివి నువ్వే అని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



