Karthika Deepam2 : కార్తీక్ కి షాకిచ్చిన జ్యోత్స్న.. అవార్డు అందుకోబోయేది ఎవరంటే!
on May 20, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -361 లో..... బెస్ట్ రెస్టారెంట్ అవార్డు ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్తీక్ రన్ చేస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ కి వస్తుంది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బావ నిన్ను కలవాలంటూ జ్యోత్స్న మెసేజ్ చేస్తుంది. అది చూసి కార్తీక్ జ్యోత్స్నని కలవడానికి వస్తాడు. బావ కంగ్రాట్స్ అని జ్యోత్స్న షేక్ హ్యాండ్ ఇస్తుంది.
ఆ తర్వాత ఇప్పుడు నేనొక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానంటూ కార్తీక్ సంతకం పెట్టిన పేపర్ పై తనకి నచ్చింది రాసుకొని జ్యోత్స్న వస్తుంది. అది కార్తీక్ కి ఇవ్వగానే షాక్ అవుతాడు. ఇక ఇప్పటి నుండి నీ మీద సర్వహక్కులు ఉంటాయని జ్యోత్స్న ఉంటుంది. ఇక నువ్వు నాకు సీఈఓ.. ప్రతీది నువ్వే అని జ్యోత్స్న అంటుంది. దానికి అవును నేను కాదంటున్నానా అంటూ.. జ్యోత్స్న అన్న వాటికి కార్తీక్ సరే అంటుంటాడు. అంత ఈజీగా సరే అంటున్నావేంటి బావ అని జ్యోత్స్న అనగానే.. నేను ఎదరుచూస్తుంది వస్తుంది ఎందుకు వద్దంటానని కార్తీక్ అంటాడు. నీ స్థానంలోకి దీపని తీసుకొని వచ్చే వరకు నీతో ఇలాగే ఉండాలని కార్తీక్ అనుకుంటాడు. నీకు ఇంకో సర్ ప్రైజ్ సత్యరాజ్ రెస్టారెంట్ నువ్వు రన్ చేస్తున్నావంటే ఆ రెస్టారెంట్ కూడ నాదే అన్నట్లు కదా.. సో రేపు అవార్డు నేను అందుకోబోతున్న అని జ్యోత్స్న చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.
మరొకవైపు శివన్నారాయణ అవార్డు రాలేదని కోప్పడతాడు. వాడు ఛాలెంజ్ చేసాడు.. గెలిచాడని శివన్నారాయణ అంటుంటే.. ఏదో ఒకటి చేస్తాను తాతయ్య నువ్వు టెన్షన్ పడకు అని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు రేపు అవార్డు ఫంక్షన్ కి వెళ్ళడానికి మీకు బట్టలు తీసుకొని వచ్చానని స్వప్న, కాశీ ఇద్దరు కార్తీక్, దీప దగ్గరికి వస్తారు. రేపు అవార్డు అందుకోబోతుంది.. నేను కాదని ఎలా చెప్పాలని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
