Brahmamudi : కావ్యకి డ్రెస్ ఇచ్చిన రాజ్.. రుద్రాణి ప్లాన్ ఫెయిల్!
on May 20, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -725 లో... కావ్యని రాజ్ ఇంప్రెస్ చెయ్యడానికి తన దగ్గరికి వస్తాడు. ఇంట్లో అందరు రాజ్ తో బాగా మాట్లాడుతుంటే.. కావ్య మాత్రం ఎందుకు వచ్చావన్నట్లుగా మాట్లాడుతుంది. పదండి టిఫిన్ చేద్దామని రాజ్ అనగానే టిఫిన్ ఎక్కడిది.. చెయ్యలేదని కావ్య అంటుంది. అయితే ఏంటి నేను చేస్తానంటూ రాజ్ కిచెన్ లోకి వెళ్తాడు. నీకు దోశ చెయ్యడం వచ్చా అని అపర్ణ, ఇందిరాదేవి అంటారు.
నాకు వచ్చు అంటూ రాజ్ దోశలు చేస్తుంటాడు. అందులోకి చట్నీ అంటూ టమాట కెచప్ తీసుకొని వస్తాడు. అందరు టిఫిన్ చేస్తుంటారు. చట్నీ ఏంటి ఇలా ఉందని అందరు టిఫిన్ చెయ్యకుండా వెళ్ళిపోతారు. రుద్రాణి తన రూమ్ లో కావ్య పెళ్లి ఫోటో రాజ్ చూసేలా సెట్ చేస్తుంది. కిందకి వచ్చి రామ్ నా రూమ్ లో రిలాక్స్ అవ్వమని రుద్రాణి తన గదిలోకి పంపిస్తుంది. అక్కడ బెడ్ పై ఉన్న ఫోటోని రాజ్ చూసి షాక్ అవుతాడు.
రాజ్ కోపంగా బయటకు వస్తాడు. ఏంటి? అలా ఉన్నావని రుద్రాణి అడుగుతుంది. అక్కడ ఫోటో చూసానని రాజ్ అనగానే.. మరి చూసాక అలాగే ఉంటావేంటీ వెళ్లి అడుగమని రుద్రాణి అంటుంది. మీకు బుద్ది ఉందా.. మీ కోడలు ఫోటో అలా పెట్టావ్ ఏంటని రాజ్ కోప్పడతాడు. రుద్రాణి వెళ్లేసరికి బెడ్ పై స్వప్న ఫోటో ఉంటుంది. అప్పుడే స్వప్న వచ్చి నా ఫోటో ఇక్కడ ఏంటని కోప్పడుతుంది. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందని రుద్రాణి అనుకుంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ డ్రెస్ ఇస్తాడు. అది కావ్య వేసుకొని రాగానే రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
