Karthika Deepam2 : హంతకుడు వాడిన కత్తిని చూసిన శౌర్య.. మరో వ్యక్తిపై కార్తీక్ కి అనుమానం!
on May 17, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -359 లో......జ్యోత్స్న వచ్చి దాస్ కి వార్నింగ్ ఇస్తుంది. దాంతో కార్తీక్ దగ్గరికి వచ్చి జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విషయం మొత్తం చెప్తాడు దాస్. అసలు నువ్వు సంతకం పెట్టావ్ కానీ అందులో జ్యోత్స్న ఏం రాసిందో.. నువ్వు దీప విడిపోవాలని రాసి ఉంటుందని దాస్ అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. నా కూతురు గురించి నీకు తెలియదు.. మా అమ్మ పారిజాతం దగ్గర పెరిగిందని దాస్ అంటాడు. తనకి ఆస్తులు కావాలి.. అలాగే నువ్వు కూడా కావాలి.. అందుకు ఏదైనా చేస్తుందని దాస్ అంటాడు.
వెనకాల దూరాన దాస్ ని దీప చూస్తుంది. బాబాయ్ ఒక్కడే వచ్చి ఉంటాడా.. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని దీప అనుకుంటుంది. మావయ్య మీరు ఏం కంగారు పడకండి. ఇప్పటివరకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పుడు నాకు సిచువేషన్ మొత్తం అర్ధమైంది. నువ్వు వెళ్ళమని దాస్ కి చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వెళ్తుంటే.. అక్కడ దీపని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి దీప విని ఉంటుందా అని కంగారుపడతాడు. బాబాయ్ ఎందుకు వచ్చాడు.. ఏం మాట్లాడాడని దీప అనగానే ఏం లేదని కార్తీక్ కవర్ చేస్తాడు.
ఆ తర్వాత దీపకి కార్తీక్ జుట్టు వేస్తాడు. ఎందుకు మీకు శ్రమా అని దీప అంటుంది. కానీ కార్తీక్ ప్రేమగా తనకి జుట్టు వెయ్యడం చూసి నేను చాలా అదృష్టవంతురాలిని అని దీప అనుకుంటుంది. అప్పుడే శౌర్య బయట నుండి గట్టిగా అరవడంతో కార్తీక్ వెళ్తాడు. అక్కడ దీపని పొడవడానికి ఉపయోగించిన కత్తి ఉంటుంది. అది చూసిన కార్తీక్ పోలీస్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. పోలీసులు వచ్చి కత్తిని తీసుకుంటారు. ఎవరిపై డౌట్ ఉందని ఇన్ స్పెక్టర్ అడుగుతాడు. గౌతమ్ ఇంకొకరు ఎవరో తెలియదు మీరే కనిపెట్టాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళని సుమిత్ర అమ్మ ఇంటికి వెళ్లకని చెప్పండి అని కార్తీక్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
