Karthika Deepam2: కోర్టులో దీపని నిలదీసిన లాయర్.. ఇంట్రస్టింగ్ గా మారిన కేస్!
on Apr 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-339లో.. దీపని పోలీసులు కోర్ట్ లోపలకి తీసుకొని వెళ్తారు. జ్యోత్స్నని తిట్టేస్తాడు కార్తీక్. అందరు లోపలికి వెళ్తారు. ఇక కోర్టులో వాదన మొదలవుతుంది. ఇటు దీప తరపున కళ్యాణ్ ప్రసాద్, అటు జ్యోత్స్న వాళ్ల తరపున భగవాన్ aదాసు ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు. సుమిత్రను విచారించడానికి దీప తరుపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అనుమతి కోరతాడు. ఆమె వస్తుంది. మీపేరు అని కళ్యాణ్ అనగానే.. సుమిత్ర అంటుంది. దీపను చూపిస్తూ.. తను ఎవరో తెలుసా అంటాడు. తెలుసు.. మా ఇంట్లో ఉండేది. మేమే ఉండమన్నామని సుమిత్ర అంటుంది. ఆమె మీ బంధువా అని కళ్యాణ్ అంటాడు. కాదని సుమిత్ర అనగానే.. మరి ఏ బంధుత్వం లేకుండా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని లాయర్ అంటాడు. నా ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞతతో అని సుమిత్ర అనగానే.. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో ఉన్న దీప.. తన భర్త కోసం సిటీకి వచ్చి.. అనుకోకుండా సుమిత్రగారి ప్రాణాలు కాపాడందన్న కృతజ్ఞతతో తన ఇంట్లోనే ఉండమని చెప్పానని ఆవిడే చెబుతున్నారు.. భార్యకు ప్రాణాలు పోసి భర్త ప్రాణాలు ఎలా తీస్తుంది యువరానర్ అంటూ లాజిక్‌గా కళ్యాణ్ ప్రసాద్ చెప్తుంటాడు. వెంటనే భగవాన్ దాసు పైకి లేచి.. అబ్జెక్షన్ యువరానర్.. ఓ తల్లి తన ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని చంపిన విషయం మనందరికీ తెలిసిందే. ఏం.. ఆ తల్లి బిడ్డల్ని కనేటప్పుడు ప్రేమ లేకుండానే కనిందా? చంపేటప్పుడు ఆ ప్రేమ ఏమైంది? అంటే మనుషులు మారతారు.. ప్రేమ మారుతుంది.. ప్రాణాలు పోసిన ఈవిడ ప్రాణాలు ఎందుకు తీయకూడదని కొత్త పాయింట్ లాగుతాడు.
ఇక భగవాన్ దాసు.. యువరానర్.. దీప చంపాలి అనుకున్నది దశరథ్ గారిని కాదు.. జ్యోత్స్నను.. ఆ నిజం తనతోనే చెప్పిస్తాను.. అనుమతి ఇవ్వండి అనగానే సరే అంటుంది జడ్జ్. ఇక దీప దగ్గరకు వెళ్లిన భగవాన్ దాసు.. నీ పేరు.. నీ భర్త పేరు అంటూ ప్రశ్నలు స్టార్ట్ చేస్తాడు. దీప, కార్తీక్ అంటూ దీప సమాధానాలు ఇవ్వగానే.. మరి నరసింహా ఎవరని భగవాన్ దాసు అంటాడు. వెంటనే కళ్యాణ్.. అబ్జెక్షన్ చెప్తూ పైకి లేచి.. దీప కార్తీక్‌ని రెండో పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం విడాకులు ఇచ్చి జైల్లో ఉన్న నరసింహా గురించి అప్రస్తుతం అని అంటాడు. అసలు గొడవ మొదలైందే నరసింహా గురించి అని భగవాన్ దాసు అంటాడు. ఎవరి గురించి అని కళ్యాణ్ ప్రసాద్ అనగానే.. కార్తీక్ గురించి దీప ఎన్నోసార్లు జ్యోత్స్నతో గొడవ పడిందని భగవాన్ దాసు అంటాడు. లేదు.. కార్తీక్ బాబు గురించి నేనెప్పుడు జ్యోత్స్నతో గొడవపడలేదని దీప అంటుంది. అబద్దం.. బావ గురించి నాతో చాలాసార్లు గొడవపడిందని జ్యోత్స్న పైకిలేస్తుంది. వెంటనే కార్తీక్ పైకి లేచి.. మొదలుపెట్టింది ఎవరు? ఎవరు ఎవరి దగ్గరకు వెళ్లి గొడవపడ్డారని కార్తీక్ అంటాడు. వెంటనే జడ్జ్ ఇద్దరి మీద సీరియస్ కావడంతో ఇద్దరూ సారీ చెప్పి కూర్చుంటారు.
దీప ఎలాంటిదో ఇప్పుడే నిరూపిస్తానంటూ సుమిత్రను పిలిపించి.. సాక్ష్యానికి జ్యోత్స్నని పిలిపిస్తాడు. జ్యోత్స్న రాగానే.. దీపా నీ సమక్షంలో మొదలైన కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం ఎవరి కారణంగా ఆగిపోయింది. నువ్వు కారణం కదా అని భగవాన్ దాసు అంటాడు. తప్పక అవునని దీప అంటుంది. నువ్వు కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా లేదా అని భగవాన్ దాసు అనగా.. ఇచ్చానని దీప అంటుంది. నువ్వు కార్తీక్‌ని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావని భగవాన్ దాసు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
