Karthika Deepam2: జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. స్పృహలోకి వచ్చిన దశరథ్!
on Apr 19, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-335లో.. పోలీస్ స్టేషన్ కి జ్యోత్స్న వస్తుంది. ఇక సెల్ లో ఉన్న దీపని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఇక తను రెచ్చిపోయి జ్యోత్స్న పీక పట్టుకోవడంతో ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఇక కార్తీక్ సారీ చెప్పడంతో ఎస్ఐ వదిలేస్తాడు. రిజిస్టర్ లో సంతకం చేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే దీపకి ఆవేశం తగ్గించుకోమని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కోసం బయట జ్యోత్స్న వెయిట్ చేస్తుంటే అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అది గమనించిన జ్యోత్స్న.. బావా నీతో మాట్లాడాలని అంటుంది. నీకు మాట్లాడటం కూడా వచ్చా.. అంటే నీకు గొడవ పడటం తప్ప మిగతా మనుషుల్లా మామూలుగా మాట్లాడవు కదా అని కార్తీక్ అంటాడు. మా డాడీ ఆసుపత్రిలో ఉన్నారని జ్యోత్స్న అనగానే.. నా భార్య పోలీస్ స్టేషన్‌లో ఉందని కార్తీక్ అంటాడు.
దీప గన్ తో నన్ను చంపాలనుకుంది బావ అని జ్యోత్స్న అనగానే.. అది దీప చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లోకి వెళ్లి బీరువాలో పెట్టుకున్న గన్ దీప తీసిందా? లేదా నీ చేతుల్లోంచి లాక్కుందా అని కార్తీక్ అంటాడు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలని జ్యోత్స్న అనగానే.. నిన్ను నువ్వే కాదు ఆ గౌతమ్ గాడ్ని కూడా కాపాడుతున్నావ్.. నీ ఉద్దేశాలేంటో నీ ఆలోచనలు ఏంటో అన్నీ అర్థమయ్యే దీప నీకు బుద్ధి చెప్పాలనుకుంది.. అందరి ముందు నువ్వు ఎలాంటిదానివో నిజం చెప్పాలనుకుందని కార్తీక్ అంటాడు. మరి మా తాతకు నిజం చెప్పకుండా మా డాడీని ఎందుకు కాల్చిందని జ్యోత్స్న అనగానే.. నువ్వు దీపని మాటలతో రెచ్చగొట్టావని కార్తీక్ అంటాడు. అన్నీ నీకోసమే చేశానని జ్యోత్స్న అనగానే కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ప్రేమ కోసం ప్రాణాలను తీసేయరు.. అన్నింటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు.. నువ్వు ఆడదానివై ఉండి పైకి ఏడుస్తున్నావ్.. నేను ఏడవలేకపోతున్నాను.. అందరి ఏడుపుకి నువ్వే కారణం అంటు కార్తీక్ అరుస్తాడు. సరేలే బావా.. నేను కారణం అన్నావ్ కదా.. పోతాలే అంటూనే చిటిక వేసి.. కానీ దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదు బావా.. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే.. జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. నీ ప్రియమైన భార్యకు అనేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది.
మరోవైపు శౌర్య తినకపోతే అనసూయ బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ నాన్న వస్తేనే తింటానని శౌర్య అంటుంది. ఇక అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్యకు సద్దిచెప్తాడు. అమ్మకు చాలా పని ఉండి ఆగిపోయింది. వచ్చేస్తుందిలే అని సర్దిచెప్పి తనే తినిపిస్తాడు. నువ్వు వెళ్లి పడుకో.. నేను వచ్చేస్తానని శౌర్యను పంపిస్తాడు కార్తీక్. అయితే శౌర్య వెళ్తూ వెళ్తూ దీపకు తీసుకెళ్లబోయే క్యారేజ్ చూసి ఎవరికి అని అడుగుతుంది. వేరెవరో అడిగారు.. ఇచ్చేసి వస్తానని చెప్పి శౌర్యను పంపేస్తాడు కార్తీక్. శౌర్యకు వినిపించకుండా కాంచన, అనసూయ కార్తీక్.. దీప పరిస్థితి గురించి బాధపడతాడు. మరోవైపు ఆసుపత్రిలో దశరథ్ చేతి వేళ్లు కదుపుతూ స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
