"నన్నింకా దగ్గరకు తీసుకో దీపా".. బేలగా అడిగిన డాక్టర్ బాబు!
on Jul 24, 2021
.jpg)
డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ తండ్రి ఆనందరావుతో 'మీ కుమారుడి వల్ల నేను గర్భవతి అయ్యాను. నా కడుపులో బిడ్డకు మీరు తాతయ్య' అని మోనిత చెప్పడంతో, ఆనందరావుకు హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశాక... వంటలక్క అలియాస్ దీపతో బయటకు వెళుతున్న డాక్టర్ బాబును తనతో రమ్మని మోనిత అంటుంది. అప్పుడు వంటలక్క ఇచ్చిన వార్నింగ్ కు మోనితలో వణుకు మొదలవుతుంది. (శుక్రవారం, జూలై 23న 'కార్తీక దీపం' ఎపిసోడ్ లో జరిగింది ఇది).
'కార్తీక దీపం' సీరియల్ నేడు (జూలై 24న) 1098 ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి? అనేది ఒక్కసారి చూస్తే... కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ లవ్ సీన్ అని చెప్పాలి.
హాస్పిటల్‌లో జాయిన్ చేసిన ఆనందరావుకు అవసరం అయితే స్టంట్ వేయాలని డాక్టర్ బాబుతో గోవర్ధన్ చెబుతాడు. అతడిని ఆ పనులు చూడమని చెప్పిన డాక్టర్ బాబు... భార్యాబిడ్డలను ఏళ్లుగా దూరం పెట్టిన శాపం వలన ఈ విధంగా జరిగిందని బాధపడతాడు. మోనిత వల్ల తనను తల్లితండ్రులు నమ్మడం లేదని, రేపు సమాజం కూడా నమ్మే పరిస్థితి ఉండదని ఆవేదనకు లోనవుతాడు. అప్పుడు అతడికి వంటలక్క అండగా నిలుస్తుంది.
'ఎందుకు అంత నిరాశ డాక్టర్ బాబు? న్యాయంతో పాటు నేను కూడా మీవైపే ఉన్నాను' అని వంటలక్క ప్రేమ చూపిస్తుంది. అప్పుడు ఆమె భుజంపై డాక్టర్ బాబు వాలతాడు. 'నన్ను ఇంకా దగ్గరకు తీసుకో దీప. ప్రేమగా దగ్గరకు తీసుకో. అందులో జాలి కానీ, రాజీ కానీ లేకుండా ఇంకా దగ్గరకు తీసుకో' అంటూ డాక్టర్ బాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే ప్రేమగా అతడిని నిమురుతుంది దీప. నేపథ్యంలో 'తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం' పాట వస్తుంది. ఇద్దరి మధ్య ఈ ఎమోషనల్ లవ్ సీన్ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పాలి.
మోనిత కారణంగా ఆనందరావు హాస్పటలైజ్ అయ్యారని శ్రావ్య ద్వారా భాగ్యం తెలుసుకుంటుంది. వెంటనే తిట్ల పురాణం అందుకుంటుంది. మళ్ళీ శ్రావ్య ఆపడంతో ఆగుతుంది. ఆ తర్వాత డాక్టర్ బాబు, వంటలక్క బయటకు వెళ్తున్న సమయంలో మోనిత వచ్చే సీన్ వస్తుంది. ముగ్గురి మధ్య సంభాషణల్లో తన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావని మోనితపై కార్తీక్ కోప్పడతాడు.
తర్వాత '25న నా మెడలో కార్తీక్ మూడు ముళ్ళు వేస్తే... మనకు ఉమ్మడి మొగుడు, పెద్దాయన కామన్ మావయ్య' అని దీపతో మోనిత చెబుతుంది. తర్వాత మోనితకు వంటలక్క వణుకు పుట్టించే సీన్ వస్తుంది. ఎన్ని చేసినా పెళ్లి మాత్రం ఆగదని మోనిత చెబుతుంది. ఆటోవైపు దీప, హాస్పిటల్ లోకి కార్తీక్, మరోవైపు మోనిత వెళ్లిన తర్వాత సీన్ కట్ చేస్తే... చివరకు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట అందరూ వెయిట్ చేస్తున్న సన్నివేశంతో ముగిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



