Home

»

Tv News

Karthika Deepam2 : లైవ్ కుకింగ్ కాంపిటీషన్.. దక్షిణామూర్తి సవాల్ తో మారిన సీన్!

Jul 7, 2026 11:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -715 లో.....జ్యోత్స్న రాత్రి అయినా తనకి ఇచ్చిన పెండింగ్ ఫైల్స్ ని చెక్ చేస్తుంది. సూరజ్ వచ్చి నేను వెళ్తున్నా బంగారం అని అంటాడు. ఉండొచ్చు కదా అని జ్యోత్స్న ప్రేమగా అంటుంది. నాకు హెల్ప్ చెయ్యొచ్చు కదా అని జ్యోత్స్న అనగానే చెయ్యనని సూరజ్ అంటాడు. చెయ్యకపోతే మా తాతతో చెప్తాను సూరజ్ హెల్ప్ చెయ్యమంటే చెయ్యడం లేదని అని జ్యోత్స్న అనగానే సరే చేస్తానని సూరజ్ అంటాడు. మా తాత అంటే బానే భయం ఉందని జ్యోత్స్న అంటుంది. భయం కాదు గౌరవమని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్న ఫైల్స్ ని సూరజ్ చూస్తాడు. జ్యోత్స్న మాత్రం ఫోన్ లో రీల్స్ చూస్తుంది. నేను నీకు హెల్ప్ చేస్తున్నా , నువ్వు చేయడం లేదు.. నీ పని నువ్వు చెయ్ అని సూరజ్ అంటాడు.

హెల్ప్ చేస్తానన్నావ్ చెయ్.. ఇంకెందుకు మాటలు అని జ్యోత్స్న అంటుంది. నీకు ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని సూరజ్ అనుకుంటాడు. మరుసటిరోజు శివన్నారాయణ దగ్గరికి జ్యోత్స్న ఫైల్స్ తీసుకొని వచ్చి.. రాత్రంతా చెక్ చేసానని చూపిస్తుంది. ఫైల్ ఓపెన్ చూసేసరికి అన్ని తప్పులే ఉంటాయి. ఇదేనా నువ్వు చెక్ చేసిందని జ్యోత్స్న మీద శివన్నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత సూరజ్ కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి జ్యోత్స్న గారికి హెల్ప్ చేసానని చూపిస్తాడు. అవి చూసి శివన్నారాయణ క్లియర్ గా ఉన్నాయని చెప్తాడు. ఆ తర్వాత సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి ఏంట్రా సరిగ్గా చెక్ చెయ్యలేదా అని అడుగుతుంది. అది నీ పని నా పని కాదని తనకి కౌంటర్ వేస్తాడు సూరజ్. ఆ తర్వాత పారిజాతం ఇల్లు క్లీన్ చేస్తుంటే అప్పుడే కార్తీక్ వచ్చి తన ఫోటో తీస్తాడు. ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు తీసావారా ఇప్పుడు తీస్తునావని పారిజాతం అంటుంది. నా మెమోరీస్ అని గుర్తు ఉంచుకో అని కార్తీక్ అంటాడు. అప్పుడే ఒకతను వచ్చి అమ్మ సర్ ని కలవడానికి కొంతమంది వచ్చారని చెప్తాడు. మీరు వాళ్ళని రమ్మనండి మా ఆయనకి చెప్తానని పారిజాతం అంటుంది‌. బానే కవర్ చేసావ్ గా నిన్ను పనిమనిషి అనుకోకుండా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరు వస్తారు. ఎందుకు సడెన్ గా కలవాలి అన్నారని శివన్నారాయణ అంటాడు. ఎప్పుడు ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు కి పోటీ జరుగుతుంది కదా.. ఇప్పుడు కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నాం కానీ లైవ్ లో చెఫ్స్ ఫుడ్ ప్రిపేర్ చెయ్యాలని వాళ్ళు చెప్తారు. ఇది కదా పోటీ అంటే అని కార్తీక్ అంటాడు. ఇందులో ఒక కొత్త రెస్టారెంట్ యాడ్ అయిందని వాళ్ళు చెప్తారు. ఎవరు అని శివన్నారాయణ అంటాడు.

అప్పుడే నేనే అంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. మీ రెస్టారెంట్ కి ఎదురుగా నిన్నే అన్ని రెస్టారెంట్లు ఓపెన్ చేసానని అతను చెప్తాడు. మీ గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారని దక్షిణామూర్తి అంటాడు. అది వాళ్ళ అభిమానమని శివన్నారాయణ అంటాడు. పోటీలో దిగాకా తెలుస్తుంది ఏదైనా అని శివన్నారాయణ అంటాడు. మీరు, దక్షిణామూర్తి ఇద్దరు బంధువుల్లా మాట్లాడుకుంటున్నారని వచ్చిన వాళ్ళు అంటారు. ఆ తర్వాత దక్షిణామూర్తి చుట్టూ పక్కన చూస్తాడు. సూరజ్ కోసం   చూస్తున్నాడని శివన్నారాయణ అనుకుంటాడు. దక్షిణామూర్తిని తప్ప అందరిని వెళ్ళమంటాడు. అందరు వెళ్ళాక సూరజ్ ని పిలిచి కొడుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. దక్షిణామూర్తిని వెళ్లిపొమ్మంటాడు. తను వెళ్లక ఇప్పుడు సూరజ్ ని ఎందుకు కొట్టావ్ తాత అని కార్తీక్ అడుగుతాడు. నేను దక్షిణామూర్తి మనిషి అనుకొని ఆయన ముందు కొట్టి తన డౌట్ క్లియర్ చేసుకున్నాడని సూరజ్ అంటాడు. సర్ నేను మీ మనిషిని అని సూరజ్ చెప్తాడు. నన్ను అర్థం చేసుకున్నావ్ థాంక్స్ అని శివన్నారాయణ అంటాడు. నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకు అని సూరజ్ ని అక్కడ నుంచి వెళ్ళమంటాడు. దీప, కార్తీక్ ఇంకా ఆశ్చర్యంగానే చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com