
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-313 లో.. గంగ గురించి పైడిరాజు లక్ష్మీ ఇద్దరు మాట్లాడుకోవడం మెట్ల నీద నుండి జయ వింటుంది. ఎలాగైనా వారిని అవమానించాలని అనుకుంటుంది. ఇక జయ తన ప్లాన్ ప్రకారం తన చెప్పుని తనే తెంపేసి.. పైడిరాజు, లక్ష్మీ దగ్గరికి వస్తుంది. డ్రైవర్ అని జయ పిలవగానే చిన్నా పెద్దా తేడా తెలియదా అని లక్ష్మీతో జయ అంటుంది. డ్రైవర్ ని డ్రైవర్ అనక కలెక్టర్ అని పిలుస్తారా ఏంటని జయ అంటుంది. నువ్వు ఆగు లక్ష్మీ, మీరు చెప్పండి అమ్మ అని పైడిరాజు అంటాడు. నువ్వు వెళ్ళి ఈ చెప్పు కుట్టించుకురా అని పైడిరాజుతో జయ అనగానే లక్ష్మీ, పైడిరాజు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్.. మేము వంటచేయడానికి, మా ఆయన డ్రైవింగ్ చేయడానికి మాత్రమే వచ్చామని జయ మీద లక్ష్మీ కోప్పడుతుంది.
లక్ష్మీని పైడిరాజు ఏం అనొద్దని అంటాడు. మరోవైపు రంగ, గంగ, రుద్ర అప్పుడే విశ్వ వాళ్ళ ఇంటికి వస్తారు. గంగ కార్ దగ్గర ఆగిపోతుంది. ఏం అయింది గంగ అక్కడే ఆగిపోయావని రుద్ర అంటాడు. ఈ ఇంట్లో జయ ఉంటుంది. నాకు నచ్చడం లేదని గంగ అనగానే నీకు బాక్సింగ్ కోచింగ్ కావాలి.. విశ్వ సర్ కోసం వచ్చావ్.. మిగతావేమీ పట్టించుకోకు.. కోచ్ ని ఇంటి నుండి తీసుకెళ్తే బాగుంటుందని రుద్ర అనగానే కరెక్ట్ గా చెప్పారు బావ అని రంగా అంటాడు. ఆ తర్వాత గంగని కన్విన్స్ చేసి ఇంట్లోకి తీసుకెళ్తాడు. అప్పుడే జయ చెప్పుని పైడిరాజు పేపర్ లో పెట్టడం గంగ చూసి దానిని విసిరేస్తుంది. ఏంటి నాన్న మీరు చేసేది అని గంగ అంటుంది. తప్పేంటి.. డ్రైవర్లు ఈ పనిచేయొద్దని ఉందా అని జయ అంటుంది.
ఇక ప్రతీ ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. చిన్నా పెద్దా తేడా తెలుసుకుని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని జయతో రుద్ర అంటాడు. నా ఇష్టం అన్నట్టుగా జయ మాట్లాడుతుంది. అప్పుడే విశ్వ, సుధా వస్తారు. ఏంటి రుద్ర ఎందుకు తనకి వార్నింగ్ ఇస్తున్నావని విశ్వ అడుగుతాడు. జయ తన చెప్పు కుట్టించుకురమ్మని మామయ్యతో చెప్పిందంటూ జరిగిందంతా చెప్తాడు రుద్ర. ప్రతీసారి తనని నేను అంటుంటే అడ్డుపడతావ్ కదా..మన ఇంట్లో పనిచేసేవాళ్ళని ఎప్పుడైనా మనం తక్కువ చేసి చూశామా అని సుధాతో విశ్వ అంటాడు. లేదని సుధా అంటుంది. ఇక జయ దగ్గరకి విశ్వ వచ్చి తనమీద కోప్పడుతాడు. మనకన్నా పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలుసుకో సారీ చెప్పమని విశ్వ అంటాడు. దాంతో చేసేదేమీ లేక పైడిరాజుకి జయ సారీ చెప్తుంది. సరిపోదు.. రెస్పెక్ట్ కావాలని విశ్వ అనగానే దండం పెట్టి .. ఐ ఆమ్ సారీ అంకుల్ అని చెప్పేసి జయ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత గంగ, రుద్ర, విశ్వ మాట్లాడుకుంటారు. కాసేపటికి సుధా కాఫీ తీసుకొస్తుంది. గంగ కాఫీ తీసుకోబోతుంటే .. నో .. స్టాప్ గంగ.. బాక్సింగ్ కోచింగ్ లో బాడీ ఫిట్ గా ఉండాలి.. ఇలా షుగర్స్ తింటే ఎలా ప్రాపర్ డైట్ మెయిన్ టైన్ చేయాలి కదా అని గంగకి క్లాస్ తీసుకుంటాడు విశ్వ. ఇక విశ్వ చెప్పినట్టు చేస్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






