(1).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 548లో.. గుడిలో అమూల్య, విశ్వక్‌ను కలిసి తన ప్లాన్ మొత్తం చెప్తుంది. ప్రేమ వదినను నాకు ఒంటరిగా దొరికేలా చేయి. మీ నాన్న, అత్త కలిసి చేసిన డ్రామా ఏంటో ఆమెకు అర్థమయ్యేలా చెప్పి, అందరి ముందే ప్రేమ–ధీరజ్‌లను కలిపి మా ఇంటికి తీసుకెళ్తానని అంటుంది. ప్రేమ–ధీరజ్ బావలను కలపడానికి నేను పెద్ద ప్లాన్ చేస్తున్నానని అది నీ కోసమే అని విశ్వ అంటాడు. మరోవైపు ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నప్పటికీ, జరిగిన అవమానంతో బాధపడుతుంటారు. నేను నిన్న అంతగా ప్రేమించానే.. ఒక్క రోజులోనే నీ ప్రేమ అంతా ద్వేషంగా ఎలా మారిపోయిందని ధీరజ్ బాధపడితే.. నా మనసులో ఎంత బాధ ఉంటే ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకోరా అని ప్రేమ మనసులోనే అనుకుంటుంది. ఇంతలో ధీరజ్‌పై పందిరి పడటంతో ప్రేమ కంగారుపడుతుంది. వెంటనే ధీరజ్ పేరు చెప్పి అర్చన చేయించి, అమ్మా.. నేను తప్పు చేశాను. వాడికి ఏం కాకూడదని ప్రేమ దేవుడిని వేడుకుంటుంది.
అర్చన పూర్తయ్యాక ప్రేమకు ధీరజ్ ఎదురవుతాడు. ప్రేమ.. ఐ యామ్ సారీ. నా మాటలు నీ మనసుకు బాధ కలిగించాయని నాకు అర్థమవుతుందని తన చేయి పట్డుకుంటాడు. కానీ ప్రేమ కోపంగా నీ సారీలు, సంజాయిషీలు నాకేం అక్కర్లేదు. చేయి వదులు అని అంటుంది. ధీరజ్ జరిగిన విషయం చెప్తుండగా.. నువ్వు ఆ మాట అనకుండా ఉండుంటే.. నేను తప్పు చేసినదానిలా అందరి ముందు తలదించుకునేలా చేయకుండా ఉండుంటే.. నువ్వేం చెప్పినా వినేదాన్ని. కానీ నా మనసు చచ్చిపోయిన తర్వాత నువ్వేం చెప్పినా వినాలని లేదని ప్రేమ చెప్తుంది. ఇంతలో వేదవతి, నర్మద వచ్చి అసలు విషయం వినమని అంటారు, ప్రేమ మాత్రం.. ఆ గొడవను గుర్తు చేయకండి.. నాకు వీడు అన్న మాటలే గుర్తొస్తున్నాయంటూ బాధపడుతుంది. ధీరజ్ ప్రేమను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, ఆమె భుజంపై చేయి వేయడంతో జాకెట్ చిరిగిపోతుంది. దాంతో రామరాజు తీవ్రంగా కోపగించి ధీరజ్‌ను చెంపదెబ్బ కొడతాడు.
ఈ ఘటనతో భద్రవతి కావాలనే రచ్చ చేస్తూ.. మొన్న మాటలతో మానసిక క్షోభ పెట్టారు.. ఇప్పుడు అందరి ముందు జాకెట్ చింపి అవమానించారంటూ ప్రేమను మరింత రెచ్చగొడుతుంది. ధీరజ్ మాత్రం.. నేను తనను బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. బాధలో ఉంటే ఓదార్చాను, భయపడితే ధైర్యం చెప్పాను.. అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. జరిగింది మర్చిపోయి మళ్లీ ప్రేమగా కలిసి ఉందామంటూ ప్రేమను రిక్వెస్ట్ చేస్తాడు. భద్రవతి వెంటనే మాట మార్చి.. ప్రేమా.. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకే ఉంది. నీ భర్తతో వెళ్లాలనుకుంటే సంతోషంగా వెళ్లిపోమని అంటుంది. వేదవతి ఇంటికి వచ్చి మాట్లాడుకుందామని అడిగిన ప్రేమ నిరాకరిస్తుంది. చివర్లో రామరాజు కూడా భార్యాభర్తల మధ్య దూరం పెరగకూడదని చెప్తాడు. కానీ ప్రేమ మాత్రం.. మామయ్య.. మీ అందరి మీద నాకు కోపం లేదు. కానీ వీడు నాకు వద్దు అని తేల్చి చెప్పడంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(3).webp)
.webp)
