.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -733 లో..... పారిజాతం దగ్గర ఉన్న మాలిని ఉంగరం చూసిన సూరజ్ కి డౌట్ వస్తుంది. ఇలా ఆఫీస్ నుంచి ఉన్నపలంగా వెళ్ళిపోతే ఎలా డిసిప్లేన్ లేదా అని శివన్నారాయణ అంటాడు. మీరు బయటకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని సూరజ్ అంటాడు. అప్పుడే దశరథ్ వస్తాడు. క్రమశిక్షణ అనేది అందరికి అవసరమని దశరథ్ అంటాడు. వాడి మాటలు పట్టించుకోవద్దు తాడు బొంగరం లేని వాడు అని పారిజాతం అంటుంది. అంటే ఏంటి అండి అని సూరజ్ అడుగుతాడు.
పెళ్లి కానీ వాడు అని పారిజాతం అనగానే అంటే జ్యోత్స్నని నన్ను కలిపి తిడుతున్నారా అని సూరజ్ అంటాడు. అంటే జ్యోత్స్నకి కూడా పెళ్లి కాలేదు కదా అని సూరజ్ అంటాడు. దశరథ్ మధ్యలో కలుగజేసుకొని జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుతాడు. దాంతో సూరజ్ ని జ్యోత్స్న తిట్టుకుంటుంది. ఆ తర్వాత కార్తీక, దీప ఇద్దరిని దశరథ్ వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు. ఒరేయ్ ఇప్పుడు మీతో ఇక్కడ వరకు వచ్చింది జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికి.. జ్యోత్స్న పెళ్లి దీప భవిష్యత్తుపై ఆధారపడి ఉంది.. త్వరగా పెళ్లి జరిపించండి అని దశరథ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాటల్ని శ్రీధర్ వింటాడు. కార్తీక్, దీప ఇద్దరు శ్రీధర్ ని చూసి ఎప్పుడు వచ్చారని అడుగుతారు. కార్తీక్ ఏం అన్నాడో విన్నాను.. అసలు ఏం దాస్తున్నారని శ్రీధర్ అడుగుతాడు. దాంతో కార్తీక్ మాట దాటేస్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఫొటోస్ అన్ని ఒక ఆల్బమ్ లాగా చేసుకొని సూరజ్ చూస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి చూస్తుంది. నా ఫొటోస్ అన్ని ఎందుకు తీసావని సూరజ్ ని జ్యోత్స్న తిడుతుంది.
నా ఇష్టమని సూరజ్ అంటాడు. ప్రొద్దున పెళ్లి టాపిక్ ఎందుకు తీసావని కోప్పడుతుంది. ప్రొద్దున నువ్వు మీ గ్రానీ భళే కవర్ చేశారు కదా.. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసని సూరజ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నాకు నచ్చిన దగ్గరికి వెళ్తాను నీకెందుకురా సూరజ్ పై జ్యోత్స్న కోప్పడుతుంది. మరొకవైపు కార్తీక, దీప, శౌర్య, కాంచన , శ్రీధర్ భోజనం చేస్తారు. సరదాగా శౌర్యతో మాట్లాడతారు. నాన్న పిన్ని లేదు కదా ఇక్కడే ఉండు ఆరోగ్యం బాగయ్యేవరకు అని కార్తీక్ అంటాడు. అవునా సరే అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత మీరు జ్యోత్స్న పెళ్లి గురించి బాధ్యత తీసుకున్నారు.. ఏదో దాస్తున్నారు.. త్వరలోనే బయటపడుతుందని శ్రీధర్ అనగానే కార్తీక, దీప టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
