Home

»

Tv News

Brahmamudi :  రాజు మనసు గెలుచుకునేందుకు ఇందు కొత్త ప్రయత్నాలు.. ఐశ్వర్య చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Jul 28, 2026 10:17AM


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1095 లో..... రాజు తనకి ఇలాంటి అమ్మాయి ఇష్టమో ఇందుకి చెప్తాడు. అదంతా విని బావ నాలాగా అని ఇందు అడుగుతుంది. లేదు నీలాగా అస్సలు వద్దని రాజు అంటాడు. మరొకవైపు ఐశ్వర్య క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలని టెన్షన్ పడుతుంది.

మరొకవైపు ఐశ్వర్య అంటే తన క్లాస్ మేట్ కి బాగా ఇష్టం. తన ట్రాప్ లో పడెయ్యడానికి ఐశ్వర్య ఫ్రెండ్ ని వాడుకుంటాడు. అప్పుడే తను ఐశ్వర్య దగ్గరికి వెళ్లి అతను చాలా మంచివాడు అని గొప్పగా చెప్తుంది. అతను ఎదరుగా ఉంటాడు. ఆ తర్వాత అతను వచ్చి ఐశ్వర్య ముందు తనని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. దాంతో ఐశ్వర్య నవ్వుతుంది. మరొకవైపు రాజు నిద్ర లేవగానే  బ్రష్, టవల్ తీసుకొని ఇందు వస్తుంది. అదంతా రాజు చూసి షాక్ అవుతాడు. రాజుకి ఎలా ఉంటే నచ్చుతుందో ఇందు అలా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య టిఫిన్ చేస్తుంటే లక్కీ వెళ్లి తన పక్కన కూర్చొని ఉంటాడు. దాంతో ఐశ్వర్య చిరాకుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత బావ నీకు స్పెషల్ గా పెసరట్టు వేసానని ఇందు తీసుకొని వచ్చి రాజుకి వడ్డిస్తుంది. నాక్కూడా వేయి సిస్టర్ అని లక్కీ అంటాడు. ఇది నా బావకి స్పెషల్ అని ఇందు అంటుంది. అదంతా అపర్ణ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే రాజుతో సంతోషంగా ఉండాలని అపర్ణ అంటుంది. అతను నీ మనవాడే నానమ్మ నా బావని నేను ఎలా దూరం చేసుకుంటానని ఇందు తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు నా ప్రేమ విషయం చెప్పకముందే ఆగిపోయిందని నందుని గుర్తుచేసుకొని వెంకీ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com