(1).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 Karthika Deepam2 .ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 751 లో.. దీప, కార్తీక్‌ల దగ్గరకు వెళ్తుంది జ్యోత్స్న. మీరు సూరజ్‌కి ఎందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు సూరజ్‌ని పెళ్లి చేసుకుంటావేమోనని అనుకున్నాం. కానీ మీరిద్దరూ చేసుకునేలా కనిపించలేదు. అందుకే వేరే సంబంధం చూస్తున్నామని దీప అంటుంది. దాంతో జ్యోత్స్న.. మీరు సూరజ్‌కి సంబంధాలు చూడకండి అని చెప్తుంది. కార్తీక్ వెంటనే..అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పమని అడుగుతాడు. జ్యోత్స్న చివరకు తన మనసులోని మాట బయటపెడుతుంది. సూరజ్ అంటే నాకు ఇష్టం. నేను సూరజ్‌ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. సూరజ్ నాకు కావాలని స్పష్టంగా చెప్తుంది. దీప, కార్తీక్‌లు సంతోషించినా జ్యోత్స్న నిజంగా మారిందని నమ్మలేకపోతారు.
జ్యోత్స్న మాత్రం తన ప్రేమ నిజమని చెప్తూ.. నన్ను ఎలా నమ్మించాలో చెప్పండి. నా మనసులో సూరజ్ తప్ప ఇంకెవరూ లేరు. మీరు సూరజ్‌కి సంబంధాలు చూడటం ఆపేసి, మా ఇద్దరికీ పెళ్లి చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది. సూరజ్‌కి ఈ విషయం చెప్పమని దీప అడుగుతుంది. అతను నన్ను నమ్మడు. మీరే అతన్ని ఒప్పించాలి. బావ అంటే సూరజ్‌కి మంచి గౌరవం ఉంది. మీరు చెప్తే వింటాడని జ్యోత్స్న అంటుంది. అంతేకాదు, గతంలో కార్తీక్‌తో రాయించుకున్న అగ్రిమెంట్‌ను కూడా పెళ్లి మండపంలోనే చింపేస్తానని చెప్తుంది. నాకు ఆ అగ్రిమెంట్‌తో పనిలేదు. నాకు సూరజ్ కావాలి. నన్ను నమ్మండి అని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. దాంతో దీప.. .సరే జ్యోత్స్నా.. నిన్ను నమ్ముతున్నాం. నీ పెళ్లి చేసే బాధ్యత మాది అని హామీ ఇస్తుంది.
ఇదంతా చాటుగా వింటున్న శ్రీధర్‌కు మాత్రం అనుమానం మొదలవుతుంది. వీళ్లేం మాట్లాడుకుంటున్నారు.. పెళ్లి తర్వాత ఏ నిజం బయటపెడతారని ఆలోచిస్తాడు. మరోవైపు జ్యోత్స్న.. ఈ పెళ్లి తర్వాత దీపకు న్యాయం చేస్తాను. ఆమెనే శివన్నారాయణ గారి అసలైన మనవరాలు అని అందరికీ చెప్తాను. నా పెళ్లితో మీ జీవితాలు మారిపోవాలని చెప్తుంది. చివరకు దీప, కార్తీక్‌లు ఆమెకు అండగా నిలబడి.. మా ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు కూడా సూరజ్‌కి నీ ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించు. అతనికి దూరం కావద్దని చెప్తారు. జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత దీప, కార్తీక్‌లు.. మన పెళ్లి ఫొటోల ప్లాన్ వర్కౌట్ అయ్యింది. జ్యోత్స్నలో నిజంగానే మార్పు మొదలైందని సంతోషిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(1).webp)
.webp)
