Home

»

Tv News

Brahmamudi : మొదటి సంపాదనతో చలపతికి కన్నీళ్లు తెప్పించిన రాజు.. బస్తీలో కాలర్ ఎగరేసిన తండ్రి!

Aug 18, 2026 12:29PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి  Brahmamudi  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1113 లో.. చలపతి ఇంటికి రాజు, ఇందు వస్తారు. రాజు తన మొదటి జీతం డబ్బులు ఇంట్లో ఎలా చెప్పాలో భయపడుతుంటాడు. ఇందు.. ఈ డబ్బుల గురించి నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయన నన్ను నమ్మడు. అని రాజు అంటాడు. నేను ఉన్నాను కదా.. నువ్వేం భయపడకు అని ఇందు అంటుంది. మరోవైపు వెంకీ బాధగా ఉండటాన్ని గమనించిన ఇందు.‌ నందు గురించి ఆలోచిస్తున్నావా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. వెంకీ మాత్రం విషయం బయటపడకుండా.. అలాంటిదేమీ లేదు వదిన.. పరిస్థితులు మారుతుంటాయి కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

 

తర్వాత రాజు తల్లి లక్ష్మీకి డబ్బులు చూపిస్తాడు. నిన్ను నేను ఎందుకు అనుమానిస్తాను రా.. ఈ డబ్బులు మీ నాన్నకే ఇవ్వు. ఆయన చాలా సంతోషిస్తాడని లక్ష్మీ చెప్తుంది. రాజు చలపతికి డబ్బులు ఇవ్వగా, మొదట అతను అనుమానిస్తాడు. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావ్ రా.. నువ్వు ఇంకా మారలేదనుకున్నా అని చలపతి కోప్పడతాడు. అప్పుడు ఇందు నిజం చెప్తుంది. అంకుల్.. ఇది రాజు కష్టపడి సంపాదించిన డబ్బు. స్వరాజ్ కంపెనీ లాభాల్లోకి రావడానికి రాజు చాలా కష్టపడ్డాడు. ఉద్యోగులందరూ బతుకుతున్నారంటే అతని కృషి కూడా కారణమే. అందుకే ఈ డబ్బులు నేను అతనికి జీతంగా ఇచ్చానని ఇందు చెప్తుంది. దీంతో రాజు ఎమోషనల్‌గా.. నాన్నా.. నేను ఒకప్పటిలా లేను. మోసాలు, దొంగతనాలు చేయడం మానేశాను. నిజాయితీగా కష్టపడి పని చేస్తున్నాను. మీరు కోరుకున్నట్టుగానే మారిపోయాను. ఇది నా మొదటి జీతం.. మీకు ఇవ్వాలని అనుకున్నానని చెప్పి వెళ్లిపోతాడు. రాజు మాటలు విన్న చలపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

 

చివరగా కొడుకు మారిపోయాడన్న ఆనందంతో చలపతి బస్తీలోని అందరిని పిలిచి రాజు గురించి గొప్పగా చెప్తాడు. ఇన్నాళ్లు నా కొడుకుని పనికిరానివాడు, మోసగాడు, బలాదూర్ అని ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇప్పుడు నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్నాడని చలపతి గర్వంగా చెబుతాడు. బస్తీ వాళ్లు.. ఏదో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుంటాడు.. నెలకు పది వేలు వస్తుంటాయేమో అని బస్తీవాళ్ళు అనగానే చలపతి నవ్వుతూ.. అసలు విషయం తెలిస్తే మీరు కుళ్లుకుని చస్తారు. మా వాడి నెల జీతం ఐదు లక్షలు అంటూ డబ్బులు చూపిస్తాడు. దీంతో బస్తీ వాళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com